Razole Dialysis center | ఎన్ని అడుగుల లక్ష్యమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం కావాలి.. ఆ అడుగే ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడువాలి ముందుకు అటో ఇటో ఎటో వైపు... అవును దీనికి సరిపోలే కార్యసాధకుని గురించే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అంతా చర్చించుకుంటున్నారు.. ముఖ్యంగా రెండు మూత్రపిండాలు పాడై ప్రతీ నాలుగు రోజులకోసారి డయాలసిస్‌ చేయించుకునే కిడ్నీ వ్యాధి బాధితులు అయితే చేతులెత్తి మొక్కుతున్నారు... ఇంతకీ ఎవరా వ్యక్తి.. వీళ్లపాలిట దేవుడుగా ఎందుకుఅయ్యాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.


గతంలో జనసేన నెగ్గిన ఏకైక సీటు రాజోలు


2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు సీటు అయిన  రాజోలు నియోజకవర్గం గురించే చర్చించుకున్నారు. రాష్ట్రంలో జనసేన ఒకే ఒక్క సీటు రాజోలులో గెలుపొందడం.. అదే నియోజకవర్గంలో చమురు, సహజవాయు సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి ఆర్జిస్తోన్న ఆదాయం నుంచి స్థానిక ప్రజలకు కనీస ప్రయోజనం చేకూరేలే ఏ సామాజిక పనులు నిర్వహించడం లేదని స్థానిక ప్రజలనుంచి తీవ్ర అసంతృఫ్తి వ్యక్తం అయ్యేది.. అంతే కాదు.. ఈప్రాంతంలో చమురు సంస్థల కార్యకలాపాల వల్ల భూగర్భజలాలు కాలుష్యకాసారలుగా మారి అవికాస్త కిడ్నీ సంబందిత వ్యాధులు వచ్చేలా కారణాలుగా నిలిచాయి.. అయితే ఇవేమీ పట్టని చమురు సంస్థలకు షాకిచ్చాడు ఓ యువకుడు.. ఆయనే యెనుమల వెంకటపతిరాజా.. రాజోలు నియోజకవర్గానికి చెందిన ఈయన ఓ ఎన్‌ఆర్‌ఐ.. ఉద్యోగ రీత్యా లండన్‌లో ఉంటారు. అయితే నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులపై ఆయన నిత్యం ఫైట్‌ చేస్తూ అవసరం అయినప్పుడు నియోజకవర్గానికి వస్తూ సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారు... 


రూ.60 లక్షలతో డయాలసిస్‌ సెంటర్‌..
రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రూ.60లక్షల వ్యయంతో ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన డయాలసీస్‌ సెంటర్‌ను రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాదరావు ప్రారంభించారు.. ఈ డయాలసీస్‌ సెంటర్‌ ఏర్పాటు వెనుక పెద్ద పోరటమే ఉంది. రాజోలు నియోజకవర్గ ప్రాంతంలో చమురు, సహజ కార్యకలాపాల వల్ల భూగర్బజలాలు కాలుష్యకాసారాలుగా మారుతున్నాయని వెంకటపతిరాజు గతంలో గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అంతేకాదు.. వీటి వల్ల ప్రజలు క్యాన్సర్‌, కిడ్నీ సంబందిత వ్యాధులతో మృతిచెందుతున్నారని ఫిర్యాదులో పేర్కొంటూ గత కొన్నేళ్లుగా ఇక్కడ ఈవ్యాధులు బారినపడి ఎంత మంది మృతిచెందారో కూడా లెక్కలతో వివరించారు.  ఇక్కడ లాభాలు ఆర్జీస్తోన్న సంస్థలు తగిన స్థాయిలో ఇక్కడ సీఎస్సార్‌ నిధులు ఇవ్వడం లేదని, ఇక్కడి చమురు, గ్యాస్‌ సంస్థల కార్యకలాపాల వల్ల రోగాలబారిన పడిన ప్రజలను పట్టించుకోవడంలేదని తన వాదన వినిపించారు. దీంతో 2023లో గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రాజోలు వచ్చేలా కృషిచేశారు.. చివరకు చమురు సంస్థలు దిగివచ్చాయి.. ఈ కృషి ఫలితమే ఇప్పుడు రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.60 లక్షల వ్యయంతో డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు కాగా.. రాజోలు నియోజకవర్గ ప్రజలు వెంకటపతి రాజా కృషికి కృతజ్ఞతలు చెబుతున్నారు..


అవినీతిపైనా పోరాటం... 
రాజోలు నియోజకవర్గంలో తీరప్రాంతాన్ని ఆనుకుని అక్రమంగా తవ్విన ఆక్వాచెరువులపైనా వెంకటపతిరాజు అలుపెరగని పోరాటం చేశారు.. ఇక్కడ కూడా తన పోరాటంతో సముద్రతీరప్రాంతానికి ఆనుకుని తవ్విన ఆక్వా అక్రమ చెరువులను గండ్లు కొట్టించేలా చేశారు.. ఇక మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పైనా ప్రత్యక్ష పోరాటానికి దిగారు.. ఆయన ఇంటికి రూ.30లక్షల వ్యయంతో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి రోడ్డు వేసుకున్నారని కూడా చేసిన ఫిర్యాదు చాలా దుమారాన్ని లేపింది... దానిపై కూడా విచారణ కొనసాగుతోంది.. అంతేకాదు.. ఎన్నికలకు ముందు ఓ పార్టీ సమావేశంలో కొందరు తనకు దొంగ ఓట్లు వేశారు అని వ్యాఖ్యానించిన అప్పటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఎన్నికను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి పోరాటం చేశారు.. ఇలా వెంకటపతిరాజు సమస్య ఏదైనా పోరాడేందుకు సిద్ధమని ముందుకు రావడం రాజోలు నియోజకవర్గంలో కనిపిస్తూనే ఉంటుంది..


పవన్‌కల్యాణ్‌ ఆశయాల కోసం...
ఇంతవరకు వెంకటపతిరాజు ఓ ఎన్‌ఆర్‌ఐగానే అందరికీ తెలుసు.. అయితే పవన్‌కల్యాణ్‌ను విపరీతంగా అభిమానించే వెంకటపతిరాజు ఆయన గెలుపే లక్ష్యంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కోనసీమ వ్యాప్తంగా పనిచేశారు.. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా మాజీ ఐఏఎస్‌ అధికారి దేవా వరప్రసాదరావు గెలుపుకు రాజోలు నియోజకవర్గానికి వచ్చి ఎన్నికలయ్యే వరకు ఉండి ఆయన గెలుపులో కీలకపాత్ర పోషించారు..