Bhargavi Nilayam OTT Release: ఆహాలోకి చంద్రముఖి టైపు సినిమా... తెలుగులో టోవినో థామస్ హారర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ డీటెయిల్స్

Neelavelicham In Telugu: టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళ హారర్ థ్రిల్లర్ 'నీలవెలిచం'. ఈ సినిమాను 'భార్గవి నిలయం' పేరుతో తెలుగులో అనువదించారు. ఆ సినిమా ఆహా ఓటీటీలో ఎప్పట్నించి స్ట్రీమింగ్ అవుతుందంటే?

Continues below advertisement

మలయాళ యంగ్ స్టార్ టోవినో థామస్ (Tovino Thomas) తెలుగు ప్రేక్షకులకూ బాగా తెలుసు. ఆయన హీరోగా నటించిన '2018' తెలుగులోనూ మంచి విజయం, ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. మోహన్ లాల్ 'లూసిఫర్'లో ఆయన తమ్ముడి పాత్ర చేశారు. టోవినో మలయాళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ కావడంతో ఇంకొంత మందికి తెలిశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... మలయాళంలో ఆయన చేసిన ఓ హారర్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగు డిజిటల్ స్క్రీన్ ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యింది.

Continues below advertisement

'భార్గవి నిలయం'గా మలయాళ 'నీలవెలిచం'
Neelavelicham In Telugu: టోవినో థామస్ ప్రధాన పాత్రలో రూపొందిన మలయాళ సినిమా 'నీలవెలిచం'. 'దసరా', 'రంగ బలి' సినిమాల్లో విలన్ వేషాలతో మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన షైన్ టామ్ చాకో మరొక పాత్ర చేశారు. రీమా కల్లింగల్, రోషన్ మాథ్యూ ఇతర తారాగణం. గత ఏడాది ఏప్రిల్ 20న కేరళతో పాటు కొన్ని ప్రముఖ నగరాల్లోని థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో 'భారవి నిలయం' పేరుతో డబ్ చేశారు. అయితే... తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. డైరెక్టుగా ఓటీటీలోకి వస్తోంది. 

సెప్టెంబర్ 5 నుంచి 'ఆహా'లో 'భార్గవి నిలయం'''మన టోవినో థామస్ మరోసారి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు. ఈ సెప్టెంబర్ 5 నుంచి ఆహాలో 'భారవి నిలయం' ప్రీమియర్స్ మొదలు అవుతాయి'' అని ఆహా ఓటీటీ పేర్కొంది. ఆల్రెడీ టోవినో థామస్ నటించిన 'ఫోరెన్సిక్', 'కాలా', 'లూకా అలియాస్ జానీ', 'వ్యూహం', స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2019' వంటి సినిమాలు ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే

'భార్గవి నిలయం' కథ ఏమిటి? టోవినో క్యారెక్టర్ ఏమిటి?
'భార్గవి నిలయం' సినిమాలో టోవినో థామస్ రైటర్ రోల్ చేశారు. ఒక ఊరిలోని ఓ పెద్ద ఇంటిలో ఆయన దిగుతారు. ఆ ఇంటిలో పరిస్థితులు చూస్తే చాలా రోజుల నుంచి ఆ ఇంటిలో ఎవరూ ఉండటం లేదని అర్థం అవుతుంది. అయితే... ఆ ఇంటికి ఆయన వెళ్లడంతో ఊరి జనాలు అందరూ షాక్ అవుతారు.  


తాను భార్గవి నిలయంలో ఉంటున్నాయని స్నేహితులతో చెబితే... ఊరి ప్రజలు అంతా ఎందుకు భయపడుతున్నారో వివరిస్తారు. 1950లో భార్గవి అనే అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని, ఆ తర్వాత దెయ్యం కింద మారి అక్కడే నివసిస్తుందని, ఊరి ప్రజలు అందరినీ భయపెడుతూ ఉండటం వల్ల ఎవరూ ఆ ఇంటి వైపు వెళ్లరని చెబుతారు. మరి, ఆ భార్గవి నిలయంలో రచయితకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ఊరి ప్రజలు చెప్పే కథలో నిజం ఎంత? భారవి లవ్ ఫెయిల్ కావడానికి రీజన్ ఏంటి? వంటి  విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Readకృష్ణకు పోటీగా 'బిగ్ బాస్ 8'లోకి వచ్చిన ముకుంద... మిస్ మైసూర్ to షో... యష్మీ గౌడ లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని విషయాలు

Continues below advertisement
Sponsored Links by Taboola