తెలుగు టీవీ తెలుగు టీవీ సీరియల్స్ చేస్తున్న హీరోయిన్లలో ఎక్కువ మంది కన్నడ అమ్మాయిలే. యష్మీ గౌడ కూడా ఆ జాబితాలో అమ్మాయే. అవును... సూపర్ హిట్ తెలుగు సీరియళ్లలో నటించిన ఈ అమ్మాయిది బెంగళూరు. ఇప్పుడు 'బిగ్ బాస్' ఎనిమిదో సీజన్‌లో అడుగు పెట్టింది. ఈ అమ్మాయి హిస్టరీ ఏమిటి? ఆమె ఏం చేసిందనేది తెలుసా?
తండ్రికి సొంత ఫ్యాక్టరీ ఉంది! మంచిగా చదువుకుంది! కానీ...
Yashmi Gowda Biography: సీరియల్స్ ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమైన యష్మీ గౌడ జన్మించినది కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో! ఆమె తండ్రి పేరు రమేశ్. ఆయనకు సొంత ఫ్యాక్టరీ ఉంది. యష్మీ తల్లి పేరు విజయలక్ష్మి గృహిణి. ఆవిడ హోమ్ మేకర్. ఇంట్లో ఎవరికీ టీవీ లేదా సినిమా నేపథ్యం లేవు. మరి, యష్మీ టీవీ ఇండస్ట్రీలోకి ఎలా అడుగు వచ్చారు? అంటే...
యష్మీ గౌడ... మిస్ ఫొటోజెనిక్ & మిస్ మైసూర్!
యష్మీ గౌడకు చిన్నతనం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇష్టం. స్కూల్ డేస్ నుంచి ఆవిడకు స్కిట్స్, డ్యాన్స్ వంటివి చేయడం ఆమెకు అలవాటు. అంతే కాదు... నటి కావాలని బాల్యం నుంచి బలంగా కోరుకున్నారు. బెంగళూరులోని 'దయానంద్ సాగర్ ఇనిస్టిట్యూట్'లో సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ... కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ స్టార్ట్ చేశారు. ఒక మోడలింగ్ షో కోసం ఆమె కాలేజీలో ఆడిషన్స్ నిర్వహించినప్పుడు యష్మీ గౌడ ఎంపికైంది.
అంతే కాదు... అందాల పోటీల్లో 'మిస్ ఫొటోజెనిక్', అలాగే 'మిస్ మైసూర్' టైటిల్స్ నెగ్గారు. స్నేహితుల సలహాలో కన్నడ సీరియల్ ఆడియన్స్ జరుగుతున్నాయని వెళ్లి పాల్గొన్నారు. నటనలో ఎటువంటి శిక్షణ లేకుండా ఎంపిక అయ్యారు. తొలి ప్రయత్నంలో సీరియల్ అవకాశం రావడంతో నటనకు గుడ్ బై చెప్పేశారు.
'స్వాతి చినుకులు'లో వెనిలాగా తెలుగు టీవీకి
కన్నడ సీరియల్ చేస్తున్న సమయంలో తెలుగు నుంచి యష్మీ గౌడకు పిలుపు వెళ్లింది. 'స్వాతి చినుకులు' సీరియల్ చేసే అవకాశం ఆమె తలుపు తట్టింది. అందులో ఆమెది వెనిలా పాత్రలో నటించారు. అలాగే, జీ తెలుగు' సీరియల్ 'నాగ భైరవి'లో భైరవిగా... 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్‌లో ముకుందగా యష్మీ గౌడ నటించారు.
Also Read: 'బిగ్ బాస్ 8'లో హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్... కృష్ణ ముకుంద మురారి భామ ప్రేరణ బ్యాగ్రౌండ్ ఇదే
ఒకప్పుడు తెలుగు ఒక్క ముక్క మాట్లాడలేదు! కానీ...
టీవీ షోలు లేదంటే ఇంటర్వ్యూలలో యష్మీ గౌడను చూశారా? తెలుగు గలగలా మాట్లాడుతున్నారు. కానీ, ఒకప్పుడు ఆమెకు ఒక్క ముక్క తెలుగు రాదు. ఇక్కడ టీవీ సీరియల్ చేసే అవకాశం వచ్చిన తర్వాత ఆమె తెలుగు నేర్చుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ తన సొంత ఊరు అయ్యిందని చెప్పారు. సొంతూరు బెంగళూరు కంటే ఎక్కువ భాగ్య నగరంలో ఉంటున్నానని తెలిపారు. ఛార్మినార్ ఏరియాలో షాపింగ్ చేయడం, హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పుకొచ్చారు.