Netflix India Statement On ‘C814: The Kandahar Hijack’ Row: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ ‘IC 814: ది కాందహార్ హైజాక్’పై గత కొద్ది రోజులుగా తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ అంశంపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం నెట్ ఫ్లిక్స్ సంస్థకు సమన్లు జారీ చేసింది. వివాదాస్పద అంశాలపై క్లారిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెట్ హెడ్ మోనికా షెర్గిల్ తాజాగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులు ముందు హాజరయ్యారు. వెబ్ సిరీస్ కు సంబంధించిన పలు విషయాలపై వారికి వివరణ ఇచ్చారు.
ఇకపై ఆ పొరపాటు చేయబోమని హామీ
మోనికా షెర్గిల్ సుమారు 40 నిమషాల పాటు కేంద్ర సమాచార, ప్రసార శాఖ అధికారులకు తన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ విచారణంలో భాగంగా హైజాకర్ల అసలు పేర్లను ఎందుకు వెల్లడించలేదు? వారికి హిందువుల పేర్లు ఎందుకు పెట్టారు? హైజాకర్లను సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు ఎందుకు చూపించారు? చర్చలు జరిపే వారిని బలహీనులుగా ఎందుకు ప్రొజెక్ట్ చేశారు?” అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమ వెబ్ సిరీస్ లోని పూర్తి కంటెంట్ ను మరోసారి పరిశీలిస్తామని మోనికా షెర్గిల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇక ముందు తమ ఓటీటీలో దేశ ప్రజల మనోభావాలను వ్యతిరేకంగా ఉండే ఎలాంటి కంటెంట్ ను ప్రదర్శించబోమని వెల్లడించారు. పిల్లలకు సంబంధించిన కంటెంట్ విషయాలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని నెట్ ప్లిక్స్ ప్రకటించింది.
అసలు వివాదం ఏంటంటే?
1999లో జరిగిన కాందహార్ విమాన హైజాక్ కథాంశంతో రీసెంట్ గా ‘ఐసీ 814: ది కాంధార్ హైజాక్’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యింది అయితే, ఈ విమానాన్ని హైజాక్ చేసింది పాక్ ఇస్లామిక్ ఉగ్రవాదులు. ఇబ్రహీం అక్తర్, సన్నీ ఖాజీ, సాహిద్ సయ్యద్, మిస్త్రీ జహూర్, షకీర్ విమాన హైజాక్ లో పాల్గొన్నారు. కాగా, ఈ వెబ్ సిరీస్ లో హైజాకర్ల పేర్లను మార్చారు. వాస్తవ ఘటనలో ముస్లీం టెర్రరిస్టులు పాల్గొనగా, ఈ వెబ్ సిరీస్ లో విమాన హైజాక్ లో పాల్గొన్న వారి పేర్లు భోళా, శంకర్, బర్గర్, డాక్టర్ అని పెట్టారు. వారిని మానవత్వమున్న వ్యక్తులుగా చూపించారు. దీంతో వివాదం మొదలయ్యింది. వెబ్ సిరీస్ మేకర్స్ కావాలనే ముస్లిం పేర్లకు బదులుగా హిందువు పేర్లు పెట్టి, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీవ్రంగా పరిగణించి సమన్లు జారీ చేసింది.
ఇక ఈ వెబ్ సిరీస్ ను కెప్టెన్ దేవిశరణ్, శ్రింజయ్ చౌదురి రాసిన ‘ఫ్లైట్ ఇన్‌టూ ఫియర్’ బుక్ ఆధారంగా తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ, అరవింద్ స్వామి, కునాల్ చోప్రా, కరణ్ దేశాయ్ నసీరుద్దీన్ షా కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ హిందీతోపాటు తెలుగు, కన్నడ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: వివాదంలో తమన్నా బాయ్ ఫ్రెండ్ వెబ్ సిరీస్- నెట్‌ఫ్లిక్స్ పై కేంద్రం ప్రభుత్వం సీరియస్