Intern Resign As His AI startup Gets Funding :  అదృష్టం కలసి రావాలనే కానీ.. నిండా రెండు పదులు నిండకుండానే అద్భుతాలు సృష్టించేయవచ్చని నేటి టెక్ ప్రపంచంలో ఎంతో మంది యువకులు చేసి చూపిస్తున్నారు. జెప్టో పౌండర్లు.. ఓయో  వ్యవస్థాపకుడు సహా ఎంతో మంది నిరూపించారు. అందుకే అనేక మంది యువకులు తమ ప్రతిభను చూపేందుకు... కలను నెరవేర్చుకునేందుకు చదువు పూర్తి కాక ముందు నుంచే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. వీరిలో చాలా మంది ఇంటెర్న్ షిప్ కూడా పూర్తి చేయడం లేదు. 


ఏఐ స్టార్టప్ కోసం ప్రయత్నిస్తూ ఇంటెర్నీగా వర్క్            


బెంగళూరులో ఇంజినీరింగ్ చేసి ఇంటెర్నీలో ఓ కంపెనీలో చేస్తున్న యువకుడు తన సొంత ఏఐ స్టార్టప్ పై దృష్టి పెట్టారు. ప్రాజెక్టు రిపోర్టు రెడీ చేసుకుని ఇన్వెస్టర్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే కోర్సులో భాగంగా ఇంటెర్న్ షిప్ పూర్తి చేయాలనుకున్నారు. ఓ కంపెనీలో చేరారు. ఆ కంపెనీలో అనతి కాలంలో ఆయన మంచి పనిమంతుడు.. పని నేర్చుకోవడానికి కాదు.. నేర్పడానికి చేరాడని అనుకునేలా చేశాడు. హఠాత్తుగా ఆయన ఆఫీసుకు వెళ్లడం మానేసశాడు. దాంతో అతని మేనేజర్ వాట్సాప్ చేశాడు. 


రాజకీయాల్లో అది చాలా ముఖ్యం, లేదంటే మనకు తీవ్ర నష్టం - మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు


ఆఫీస్ కు సెలవు పెట్టి  ఇన్వెస్టర్‌తో మీట్                                


శుక్రవారం ఆఫీసులో కనిపించలేదు.. ఎందుకు రాలేదని అడిగాడు. దానికి ఆ ఇంటెర్నీ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. నేను లీవ్ తీసుకున్నాను.. క్షమించాలని అడిగాడు. తర్వాత చావుకబురు చల్లగా చెప్పాడు. తాను లీవ్ తీసుకున్నది.. ఓ వెంచర్ క్యాపిటలిస్ట్ తో సమావేశం కోసమని.. తన కొత్త ఏఐ స్టార్టప్ కోసం.. లీవ్ తీసుకున్నానని చెప్పాడు. అంతే కాదు.. తన స్టార్టప్‌కు ఇన్వెస్ట్ చేయాడానికి ఆయన రెడీగా ఉన్నాడని ఇక తనకు ఇంటెర్న్ షిప్ ఎంత మాత్రం అవసరం లేదని.. ఇక తాను రావడం లేదని చెప్పేశారు. 


వరద బాధితులకు విరాళాల వెల్లువ- ఎవరెవరు ఎంత ఇచ్చారంటే?


కారణం అడిగిన మేనేజర్ కు గట్టి రిప్లై                          


ఆ మేనేజర్‌కు ఈ రిప్లైతో షాక్ తగిలినట్లు ఉంటుందని చెప్పాల్సిన పని లేదు. ఇంటెర్నీనే ఇప్పుడు నేరుగా స్టార్టప్ ఓనర్ అయిపోయాడని.. క్లిక్ అయితే.. రేపోమాపో తనకే ఉద్యోగం ఆఫర్ చేసిన ఆశ్చర్యం లేదని అనుకుని ఉంటాడు. నిజానికి స్టార్టప్స్ అన్నీ ఇప్పుడు ఏఐ ఆధారితంగానే ప్రారంభమవుతున్నాయి. కొత్త తరం అంతా ఏఐ మీద దృష్టి పెట్టి కెరీర్స్.. స్టార్టప్‌ను రెడీ చేసుకుంటోంది. మరి ఈ ఇంటెర్నీని కూడా డిస్ కంటిన్యూ చేసిన కుర్రాడు ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మరి !