Chandrababu was the first to sense the floods in Singh Nagar : విజయవాడకు సమస్య వస్తే కృష్ణా నదికి వచ్చే వరదల వల్ల వస్తుందని ఎవరైనా అనుకుంటారు. అందుకే అందరి దృష్టి కృష్ణానదిలోకి ఎంత ప్రవాహం ఉందనే దానిపైనే ఉంది. అసలు ముప్పు బుడమేరు నుంచి వచ్చి పడిందని చాలా సేపటి వరకూ గుర్తించలేకపోయారు. చంద్రబాబు అధికారుల్ని అప్రమత్తం చేసిన తర్వాతే బుడమేరు ముంచేసిందని గుర్తించారు. ఆ తర్వాత ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
కృష్ణానదితో సంబంధం లేని బుడమేరు
కృష్ణా నదికి వరదలు వస్తే సమస్య అవుతుందని కృష్ణలంకలో రీటైనింగ్ వాల్ నిర్మించారు. బుడమేరు వల్ల సమస్యలు వస్తాయని తెలుసు కానీ..ఇంత తీవ్రంగా ఉంటుందని ఊహించలేదు. అందుకే ఎవరూ బుడమేరు గురించి ఆలోచించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా అధికారులు కృష్ణాకు ఎంత వరద వస్తుంది... ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాల్నే నివేదిస్తూ వచ్చారు. మామూలుగా చంద్రబాబు శనివారం హైదరాబాద్ వెళ్లాలనుకన్నారు. అయితే అలా వెళ్లే ముందు.. కృష్ణా వరదపై వివరాలు తెప్పించుకున్నారు. బ్యారేజీ వద్ద పరిస్థితి చూసేందుకు వెళ్లారు. అప్పుడే అజిత్ సింగ్ నగర్ వైపు ప్రవాహం పెరుగుతోందన్న సమాచారం వచ్చింది.
కుట్రలు జరుగుతున్నాయేమో- చంద్రబాబు సంచలన కామెంట్స్
బుడమేరు ముప్పు గుర్తించిన చంద్రబాబు
సుదీర్గ కాలం సీఎంగా చేసిన అనుభవం ఉండటంతో ఎక్కడ ఎలాంటి నిటి ప్రవాహాలు.. వరదలు వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో చంద్రబాబుకు అంచనా ఉంది. సింగ్ నగర్ వైపు ప్రవాహం పెరుగుతోందన్న సమాచారం రాగానే ఆయన అప్రమత్తమయ్యారు. అది కృష్ణాకు వస్తున్న ప్రవాహ నీరు కాదని.. బుడమేరు పొంగిందని.. వెంటనే.. అప్రమత్తమవ్వాలని ఆదేశాలు జారీ చేసి రంగంలోకి దిగిపోయారు. అప్పటికే తర్వాత రోజు ఆదివారం కావడంతో అధికారులు రిలాక్సింగ్ మోడ్ లో ఉండిపోయారు. అప్పటికప్పుడు అందర్నీ అప్రమత్తం చేశారు. ఎంత చేసినా బుడమేరును మానవ ప్రయత్నంగా అదుపులోకి తెచ్చే పరిస్థితి లేదు. ప్రాణ నష్టం జరగకుండా మాత్రమే చూసుకోవాలి. ఆ విషయంలో అదే ప్రయత్నాలు చేయడంతో ప్రాణనష్టం తగ్గించగలిగారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం- ఆ రెండు జిల్లాల్లో భారీ విధ్వంసం
బుడమేరు పొంగితే ఉత్పాతమే
బుడమేరును బెజవాడ దుంఖదాయనిగా పిలుస్తారు. సాధారణంగా పొంగదు.. పొంగితే మాత్రం.. బెజవాడలో సగం నీటిలో మునిగిపోవాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. విజయవాడలో ఆ స్థాయిలో ఇళ్లు నీట మునుగుతాయని ఎవరూ ఊహించలేకపోయారు. మంగళవారం మధ్యాహ్నానికి కాస్త వరద తగ్గు ముఖ పట్టడంతోనే అసలేం జరిగిందో అని తెలుసుకుంటున్నారు. బుడమేరు విషయంలో చంద్రబాబు అప్రమత్తత లేకపోతే ప్రాణనష్టం కూడా జరిగి ఉండేదన్న అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు స్వయంగా అక్కడే ఉండటంతో అధికారులు కూడా హుటాహుటిన వచ్చి చర్యలు చేపట్టారు.