iPhone 15 Plus Price Drop: ఐఫోన్ 15 ప్లస్‌పై కంపెనీ భారీ తగ్గింపును అందించింది. ఈ ఫోన్ 2023 సెప్టెంబర్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లతో లాంచ్ అయింది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ కానున్నాయి. ఐఫోన్ 16 సిరీస్‌కు లాంచ్‌కు ముందు యాపిల్... ఐఫోన్ 15 ప్లస్ ధరను భారీగా తగ్గించింది. ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌పై రన్ కానుంది. అధికారిక వెబ్ సైట్ కంటే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర తక్కువగా ఉంది.


ఐఫోన్ 15 ప్లస్ ప్రస్తుత ధర (iPhone 15 Plus Price Cut)
యాపిల్ ఇండియా వెబ్ సైట్లో ఐఫోన్ 15 ప్లస్ ధర ప్రస్తుతం రూ.89,600గా ఉంది. ఇది 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఫ్లిప్‌కార్ట్‌లో ఇది రూ.13,601 తగ్గింపుతో రూ.75,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా కొన్ని కార్డులు ఉపయోగించి కొనుగోలు చేస్తే ఈ ఫోన్ ధర మరింత తగ్గనుంది. హెచ్ఎస్‌బీసీ లేదా ఫెడరల్ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,500 తగ్గింపు లభించనుంది. 


256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.85,999గా ఉంది. 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,05,999గా నిర్ణయించారు. యాపిల్ వెబ్ సైట్లో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,600గానూ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,600గానూ ఉంది.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అవుతుంది కాబట్టి త్వరలో ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో వీటి ధరలు మరింత తగ్గుతాయి. కాబట్టి తక్కువ ధరలో ఐఫోన్లు కొనాలనుకునే వారు ఆ సేల్స్‌పై ఒక కన్నేయడం బెటర్.


ఐఫోన్ 15 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐఫోన్ 15లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టుతో లాంచ్ అయిన మొదటి యాపిల్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో ఈ ఫోన్ కూడా ఒక భాగం. ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు 48 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ ట్రూ డెప్త్ కెమెరాను అందించారు. 


మరోవైపు ఐఫోన్ 16 సిరీస్ సెప్టెంబర్ 9వ తేదీన మార్కెట్లో లాంచ్ కానున్నాయి. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 10:30 గంటలకు యాపిల్ ఈవెంట్ ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతి యేటా నాలుగు కొత్త ఐఫోన్ మోడల్స్ మార్కెట్లోకి వస్తాయి. కానీ ఈసారి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లతో పాటు మరో కొత్త ఫోన్ కూడా మార్కెట్లోకి వస్తుందని సమాచారం.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?