Krishna Lanka Retaining Wall: విజయవాడ (Vijayawada) వాసులని ఊహించని వరదలు ముంచెత్తాయి. సింగ్‌నగర్‌(Singh Nagar)తో పాటు నగర శివారు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అక్కడి వారంతా ఉంటున్న ఇళ్లు వదిలి తట్టాబుట్టా  సద్దుకుని... పునరావాసకేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి. అలా కాకపోతే... ముంపులోనే కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి. అయితే... ఎప్పుడూ నీట మునిగే... కృష్ణలంక(Krishna Lanka), రాణిగారితోట (Ranigari Thota) ప్రాంతాలు మాత్రం వరద  ముంపు నుంచి తప్పించుకున్నాయి. దీనికి కారణం కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌. ఇదే ఆ ప్రాంతాలను వరద ముంచెత్తకుండా కాపాడింది. వేల కుటుంబాలను కాపాడింది. రిటైనింగ్‌ వాల్‌ లేకపోయింటే... కృష్ణలంకతోపాటు రాణిగారితోట మునిగిపోయేవి. రిటైనింగ్‌ వాల్‌.. ఆ రెండు ప్రాంతాలను కాపాడింది. ఇది చాలా సంతోషించాల్సిన విషయం... అయితే ఏపీలో ఈ అంశంమే ఇప్పుడు రాజకీయ రగడకు కారణమైంది. వేలాది కుటుంబాలను వరద ముప్పు నుంచి తప్పించిన కృష్ణలంక రిటైనింగ్‌ను  కట్టింది తామంటే తామని అంటున్నాయి టీడీపీ, వైసీపీ. రిటైనింగ్‌ వాల్‌ క్రెడిట్‌ కోసం పోటీ పడుతున్నాయి. 




రిటైనింగ్‌ వాల్‌ గురించి... 
కృష్ణలంక రిటైనింగ్‌ వాల్ (Krishna Lanka Retaining wall)‌... మొత్తం 12లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా దీన్ని నిర్మించారు. 474.51 కోట్లతో.. మొత్తం.. 3.44 కిలోమీటర్ల పొడవున ప్రకాశం బ్యారేజీ కింద ఈ వాల్‌ నిర్మాణం జరిగింది. మొత్తం  ఆరు డివిజన్లకు రక్షణగా ఈ ప్రవహరీ గోడను ఏర్పాటు చేశారు. దీని వల్ల... ఇప్పుడు వేలాది కుటుంబాలు ముంపు బారిన పడకుండా తప్పించుకున్నాయి. కృష్ణలంక రిటైనింగ్ వాల్ లేకపోయింటే... విజయవాడలో కలలో కూడా ఊహించలేని  విధ్వంసం జరిగి ఉండేది.


రిటైనింగ్‌ వాల్‌పై టీడీపీ వర్సెస్‌ వైఎస్‌ఆర్‌సీపీ
రిటైనింగ్‌ నిర్మాణంపై ఇప్పుడు టీడీపీ (Telugu Desam Party), వైఎస్‌ఆర్‌సీపీ (YSRCP) మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రిటైనింగ్‌ వాల్‌ కట్టింది తామే అని వైఎస్‌ఆర్‌సీపీ అంటుంటే... చరిత్ర తెలుకోకుండా మాట్లాడొద్దని టీడీపీ కౌంటర్‌ ఇస్తోంది..? ఇంతకీ రిటైనింగ్‌ వాల్‌ క్రెడిట్‌ ఎవరికి దక్కుతుంది...? అసలు ఏం జరిగింది...?




వైసీపీ వర్షన్‌ ఏంటంటే...!
విజయవాడ కృష్ణ రివర్ రిటైనింగ్ వాల్ ప్రాజెక్టు ఫేజ్‌-1 నిర్మాణ పనులు కాంగ్రెస్‌ హయాంలో 2009లో ప్రారంభించారు. 2009 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో కనీసం ఫేజ్‌-1 పనులు కూడా పూర్తిచేయలేకపోయారు. 2019లో వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం ఏర్పడింది. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలోనే రిటైనింగ్‌ వాల్‌ ఫేజ్‌-1 నిర్మాణ పనులతోపాటు ఫేజ్‌-2, ఫేజ్‌-3 కూడా పూర్తి చేస్తామని వైఎస్‌ఆర్‌సీపీ అంటోంది. తాము పూర్తిచేసిన కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌... విజయవాడకి ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడలో ఎన్నో వేల కుటుంబాల ప్రాణాలు, ఆస్తులను కాపాడింది. తాము నిర్మించింది ఈ రిటైనింగ్‌ వాల్‌కు‌... విజయవాడ చరిత్రలో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని వైసీపీ చెప్తోంది. అంతేకాదు.. మంచి చేసేందుకు  మనసు రాని చంద్రబాబు.... జగన్‌ ప్రభుత్వంలో నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ క్రెడిట్‌ను కొట్టేసేందుకు ముందుంటాడంటూ విమర్శిస్తున్నారు.




టీడీపీ వర్షన్‌ ఏంటంటే...!
కృష్ణలంక దగ్గర రిటైనింగ్‌ వాల్‌ 2019లో చంద్రబాబు హయాంలోనే నిర్మించారని టీడీపీ (TDP) శ్రేణులు అంటున్నారు. కృష్ణలంక ప్రజలకు మేలు చేసింది చంద్రబాబే అంటూ పోస్టులు పెడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు అబద్ధాలు చెప్పినా... గూగుల్‌  అబద్దాలు చెప్పదంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీడీపీ ట్విట్టర్‌ ఖాతాలో కూడా చంద్రబాబు హయంలో పూర్తయిన రిటైనింగ్‌ వాల్‌ విజువల్స్‌ను పోస్టు చేస్తున్నారు.