టసింహం నందమూరి బాలకృష్ణ నటవారసుడిగ ఆయన తనయుడు మోక్షజ్జ వెండితెర ఎంట్రీకి సర్వం సిద్ధమవుతుంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ దర్శకత్వ బాధ్యతలను 'హనుమాన్‌' డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో గుసగుస. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే మోక్షజ్ఞ కొత్త లుక్‌లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఈ సినిమాకు ఓ ఆసక్తికర అప్‌డేట్‌ కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమం జరుపుకోనుందట. ఇందుకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. 


సింబా వస్తున్నాడు


ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం సెప్టెంబర్‌ 6న మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా ఆ రోజున ఈ సినిమాను గ్రాండ్‌గా లాంచ్‌ చేసేందుకు టీం ప్లాన్‌ చేస్తోందట. ఇక ఈ వార్తలకు మరింత ఊతం ఇస్తూ ప్రశాంత్‌ వర్మ తాజాగా ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశాడు. మోక్షజ్ఞ మూవీ లాంచ్‌పై ఇన్‌డైరెక్ట్‌ హింట్‌ ఇచ్చాడు. ది లయన్‌ కింగ్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ "ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి ఒక కొత్త ఉషస్సు విరజిమ్ముతోంది. సింబా వస్తున్నాడు"(#SimbaisComing) అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇది చూసి నందమూరి ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. 'సింహం వారసుడు సింబా' అంటూ హ్యాష్‌ ట్యాగ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌ అభిమానుల్లో ఉన్న సందేహాలకు క్లారిటీ వచ్చింది. 






అక్క నిర్మాణంలో తమ్ముడి సినిమా


నిజానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడంటూ వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారమంత ఓ గాసిప్‌ మాత్రమే. ఇందులో నిజమెంత అనేది ఫ్యాన్స్‌లో సందేహం నెలకొంది. ఇక తాజాగా ప్రశాంత్‌ వర్మ ట్వీట్‌తో అందరికి క్లారిటీ వచ్చింది. మొత్తానికి ప్రశాంత్‌ వర్మ నందమూరి అభిమానులకు పండగ లాంటి అప్‌డేట్‌ ఇచ్చాడంటున్నారు. కాగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురు తేజస్వీని నిర్మాతగా వ్యవహరించనుందని టాక్‌. ఇక ఈ సినిమాను ప్రశాంత్‌ వర్మ సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కంచబోతున్నాడని సమాచారం. 



సూపర్‌ హీరోగా మోక్షజ్ఞ


మహాభారతం స్ఫూర్తితో ఈ సినిమా కథను ప్రశాంత్ వర్మ రెడీ చేశారట. ఇందులో మోక్షజ్ఞ సూపర్ హీరోగా కనిపించనున్నాడట. ఇప్పటికే తన పాత్రకు సంబంధించి మోక్షజ్ఞ శిక్షణ కూడా తీసుకున్నాడట. అంతేకాదు ఆ పాత్రకు తగ్గట్టుగా కూడా మేకోవర్‌ అయ్యాడు. ఇటీవల దీనికి సంబంధించి ఓ లుక్‌లో కూడా బయటకు వచ్చింది. అంతేకాదు బొద్దుగా ఉండే మోక్ష జిమ్‌లో కసరత్తులు చేసి ఫిట్‌గా అయ్యాడట. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కావడంలో ప్రశాంత్‌ వర్మ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. నటసింహం వారసుడి ఎంట్రీ అంటే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. కాబట్టి అభిమానులను ఏమాత్రం నిరాశ పరచకుండ మోక్షజ్ఞ కోసం సూపర్‌ హీరో జానర్‌ని సెలక్ట్‌ చేశాడట. ఇది హనుమాన్‌ను మంచి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడట ప్రశాంత్‌ వర్మ. 



Also Read: దేవర నుంచి డావుడి - ఆడియన్స్ చేత విజిల్స్ వేయించే ఎన్టీఆర్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్