న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటించిన కొత్త సినిమా 'సరిపోదా శనివారం'. 'నానీస్ గ్యాంగ్ లీడర్' తర్వాత ఆ ఇద్దరూ జంటగా నటించిన చిత్రమిది. 'అంటే సుందరానికి' తర్వాత నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ తీసిన చిత్రమిది. ఇందులో ఎస్జే సూర్య విలన్ పాత్రలో దుమ్ము దులిపాడు. థియేటర్లలో రికార్డుల దుమ్ము దులుపుతూ ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ నెలాఖరున ఓటీటీలోకి ఈ సినిమా వస్తుందట. 


సెప్టెంబర్ 27న ఓటీటీలో 'సరిపోదా శనివారం'?
Saripodhaa Sanivaaram Movie OTT Release Date: 'సరిపోదా శనివారం' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ఏమిటంటే... ఈ నెలాఖరున, అంటే సెప్టెంబర్ 27న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.


తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ 'సరిపోదా శనివారం' చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేశారు. హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో మినిమల్ రిలీజ్ చేశారు. అయితే, అన్ని భాషల నుంచి సినిమాకు మంచి స్పందన లభించింది. ఆగస్టు 29న థియటర్లలో సినిమా విడుదల అయ్యింది. ఇప్పుడు నెల తిరక్కుండా, నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది.


Also Readనాగ మణికంఠను స్టెప్ ఫాదర్ ఇంటి నుంచి గెంటేశారా? వచ్చేశాడా? అసలు నిజం చెప్పిన చెల్లెలు



వర్షాలు సైతం లెక్క చేయకుండా!
థియేటర్లలో సూర్య దుమ్ము దులుపుతున్నాడు. ఏపీ, తెలంగాణాలో ప్రజలు వర్షాలు సైతం లెక్క చేయకుండా అతని పెర్ఫార్మన్స్ చూడటానికి థియేటర్లలకు వెళ్లడం కనబడుతోంది. దెబ్బకు నాలుగు రోజులకు ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల రూపాయల గ్రాస్ 'సరిపోదా శనివారం' సినిమాకు వచ్చింది. ఇక్కడ సూర్య అంటే ఎస్జే సూర్యతో పాటు న్యాచురల్ స్టార్ నాని కూడా! సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు సూర్య. విలన్ రోల్ చేసింది ఎస్జే సూర్య. ఇద్దరి నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే, నాని కంటే ఎస్జే సూర్యకు కాస్త ఎక్కువ పేరు వచ్చింది.


Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే



'సరిపోదా శనివారం' విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్ రీ రికార్డింగ్ సైతం కీ రోల్ ప్లే చేసింది. యాక్షన్ సీన్లకు అడ్రినల్ రష్ ఇచ్చే మ్యూజిక్ ఇచ్చాడని సగటు సినీ ప్రేక్షకులు సైతం అతడి సంగీతాన్ని ప్రశంసించారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత డీవీవీ మూవీస్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాణ డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. దీంతో ఆయన కుమారుడు కళ్యాణ్ దాసరి నిర్మాతగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ సినిమాలో సాయి కుమార్, అభిరామి హీరో తల్లిదండ్రులుగా నటించారు. మురళీ శర్మ, అజయ్, హర్షవర్ధన్, సంపత్ రాజ్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.