Bigg Boss Naga Manikanta: నాగ మణికంఠను స్టెప్ ఫాదర్ ఇంటి నుంచి గెంటేశారా? వచ్చేశాడా? అసలు నిజం చెప్పిన చెల్లెలు
కావ్య అమరనాథ్... ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు. తెలుగు 'బిగ్ బాస్' సీజన్ 8 కంటెస్టెంట్ సాయి మణికంఠ సొంత చెల్లెలు. ఇప్పుడీ అమ్మాయి పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. అందుకు కారణం ఏమిటో తెలుసా? బిగ్ బాస్ ఇంటిలోకి అడుగు పెట్టి పెట్టడమే తన తండ్రి చిన్నతనంలో మరణించాడని, తర్వాత తల్లి వేరే పెళ్లి చేసుకుందని, తల్లి మరణం తర్వాత స్టెప్ ఫాదర్ ఇంటి నుంచి తాను బయటకు వచ్చేశానని నాగ మణికంఠ చెప్పడమే. (Image Courtesy: kavya_amarnadh / Instagram)
నాగ మణికంఠ 'బిగ్ బాస్' ఎంట్రీ తర్వాత స్టెప్ ఫాదర్ ఇంటిలో అతను ఇబ్బంది పడినట్టు కొందరు అనుకున్నారు. తన అన్నయ్య స్టెప్ ఫాదర్ అనేది నెగిటివ్ వేలో చెప్పలేదని, ఇక తమ తల్లి మరణం తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లాలనేది పూర్తిగా అన్నయ్య నిర్ణయం అని, తమ తండ్రి ఎప్పుడూ అండగా ఉన్నారని నాగమణికంఠ చెల్లెలు కావ్య అమరనాథ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తండ్రి, అన్నయ్యతో దిగిన ఫోటో షేర్ చేశారు. (Image Courtesy: kavya_amarnadh / Instagram)
నాగ మణికంఠ చెల్లెలు కావ్యకు పెళ్లి అయ్యింది. భర్తతో దిగిన ఫోటోలను ఆవిడ తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది కావ్య పెళ్లి ఫోటో. అయితే, ఇందులో నాగ మణికంఠ లేరు. సొంత చెల్లెలు పెళ్లికి కూడా అతను వెళ్లలేదా? అని నెటిజనులలో కొత్త సందేహాలు మొదలు అయ్యాయి. (Image Courtesy: kavya_amarnadh / Instagram)
తండ్రి అమర్నాథ్ తో కావ్య. ఆవిడ మాటలను బట్టి నాగ మణికంఠను ఆయన బాగా చూసుకున్నారు. (Image Courtesy: kavya_amarnadh / Instagram)
భర్త వినయ్ రావుతో కావ్య అమర్నాథ్. సోషల్ మీడియా బయో బట్టి వృత్తిరీత్యా ఆమె హెచ్ఆర్ అని తెలుస్తోంది. (Image Courtesy: kavya_amarnadh / Instagram)