BRS హ్యాట్రిక్ కొడుతుందా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. కాంగ్రెస్, అధికార BRS మధ్య టఫ్ ఫైట్ తప్పేలా లేదు. బీజేపీ కూడా పోటీలో ఉన్నప్పటికీ... అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెసే అని తాజా సర్వేలో మరోసారి తేలింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ABP News Cvoter Final Opinion Poll ఆసక్తికర విషయాలు వెల్లడించింది. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం... అధికార BRS కి 49 నుంచి గరిష్టంగా 61 స్థానాలు వస్తాయని సర్వేలో తేలింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కి 43-55 సీట్లు రాగా, బీజేపీకి 5-11 సీట్లకు పరిమితం కానుంది. ఏఐఎంఐఎం(AIMIM) 6 నుంచి 8 స్థానాల్లో గెలుస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. ఏదేమైనా బీఆర్‌ఎస్‌కి ఎడ్జ్ ఉంటుందని సర్వే చెబుతోంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలుండగా.. అధికారం చేపట్టాలంటే 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ సాధించాలి. ఇంకా చదవండి
అడగకపోయినా కాంగ్రెస్‌కే మద్దతు
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోటీ నుంచి విరమించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా బీఆర్ఎస్ ను ఓడించడానికే కాంగ్రెస్ కోసం త్యాగం చేస్తున్నట్లుగా ప్రకటించారు. షర్మిలను మద్దతివ్వాలని ఏ కాంగ్రెస్ నాయకుడు అడగలేదు. అటు ఢిల్లీ నుంచి ఇటు రాష్ట్రం నుంచి కూడా ఎవరూ పోటీ నుంచి విరమించుకుని తమ పార్టీకి మద్దతివ్వాలని షర్మిలను అడగలేదు. పైగా విలీన ప్రతిపాదనపై ఏమీ చెప్పకుండా షర్మిలను పక్కన పెట్టేశారు. ఈ కోపంతో తాను అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని షర్మిల ప్రకటించారు. కానీ చివరికి వచ్చే సరికి తను కూడా పోటీ చేయకుండా.. కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఇంకా చదవండి
రాజస్థాన్‌లో గెలుపెవరిది ? - ఏబీపీ - సీఓటర్ లెటెస్ట్ ఒపీనియన్స్ పోల్స్ తేల్చింది ఇదే
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అశోక్ గెహ్లాట్ తన పథకాల ఆధారంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి వచ్చేందుుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాజస్తాన్‌లో ఒకే పార్టీ రెండు సార్లు వరుసగా అధికారం ఇవ్వడం అనేది ఇటీవలి కాలంలో జరగలేదు. ఏబీపీ న్యూస్, సీఓటర్ సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంది. ఇందులో అదే సంప్రదాయం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా చదవండి
పవన్ కల్యాణ్ తో కిషన్ రెడ్డి కీలక భేటీ, పొత్తుపై చర్చ!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. నగరంలోని పవన్ కల్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇంకా చదవండి
బాలీవుడ్ యాక్టర్స్ బాలయ్యను చూసి నేర్చుకోవాలి - పాయల్ ఘోష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
హీరోయిన్ పాయల్ ఘోష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రయాణం, ఊసరవెల్లి వంటి సినిమాలలో నటించిన ఈ బెంగాలీ భామ.. చాలా కాలం క్రితమే టాలీవుడ్ కు దూరమైంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వీలుచిక్కినప్పుడల్లా బాలీవుడ్ పై విరుచుకుపడే పాయల్.. లేటెస్టుగా మరోసారి హిందీ నటులను టార్గెట్ చేసింది. ఈసారి సీనియర్ హీరో బాలకృష్ణను పొగుడుతూ, బాలీవుడ్ యాక్టర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంకా చదవండి
ఉస్తాద్‌కు డూప్‌గా బోయపాటి - ఎందుకు చేశాడో క్లారిటీ ఇచ్చిన రామ్ పోతినేని!
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన హైవోల్టేజీ యాక్షన్ డ్రామా ‘స్కంద’. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నవంబర్ 2వ తేదీ నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలో విడుదల అయ్యాక ఈ సినిమాపై కొన్ని ట్రోల్స్ వచ్చాయి. వీటిలో ప్రముఖమైనది క్లైమ్యాక్స్ యాక్షన్ సీన్లో ఒక షాట్‌లో రామ్‌కు డూప్‌గా బోయపాటి శ్రీను కనిపించడం. దీనిపై హీరో రామ్ పోతినేని క్లారిటీ ఇచ్చారు. ఎక్స్/ట్విట్టర్‌లో దీనిపై వివరణ ఇస్తూ పోస్టు పెట్టారు. ఇంకా చదవండి
దీపావళి సమయంలో మీ కారు జాగ్రత్త - ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉంటది!
దేశంలో ప్రస్తుతం దీపావళి పండుగ సీజన్ నడుస్తోంది. దీని కారణంగా మార్కెట్లలో సందడి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే బాణాసంచా కూడా విరివిగా కనిపించే పండుగ ఇది. ఇది కార్లకు హానికరం అని కూడా అనుకోవచ్చు. అందుకే దీన్ని నివారించడానికి కొన్ని సులభమైన చిట్కాలు తెలుసుకుందాం. ఇంకా చదవండి
హైబ్రిడ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న ఆదరణ - త్వరలో లిస్ట్‌లోకి మూడు సూపర్ కార్లు!
హైబ్రిడ్ ఎస్‌యూవీలు ఇటీవలి కాలంలో భారతీయ కార్ల మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందాయి. ఆటోమోటివ్ పరిశ్రమ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల వైపు గణనీయమైన మార్పుకు లోనవుతున్నాయి. హైబ్రిడ్ వాహనాలు ఇంధన ఖర్చులను ఆదా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రేంజ్ గురించి టెన్షన్ లేదా హోం ఛార్జింగ్ అవసరం లేకుండా వాటి కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించగలవు. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి సుజుకి ఇన్విక్టో, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా హారియర్, సఫారీ వంటి అనేక హైబ్రిడ్ ఎస్‌యూవీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా చదవండి
ఆస్ట్రేలియాదే ఆధిపత్యం, ఇంగ్లండ్‌పై మరో విజయం
ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరంలో ఆస్ట్రేలియా జట్టే పైచేయి సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి గౌరవప్రదమైన స్కోరు చేసిన కంగారులు ఆ తర్వాత ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... ఆస్ట్రేలియాను ఒక విధంగా తక్కువ పరుగులకే కట్టడి చేసింది. 49.3 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌట్ చేసి విజయం సాధించేలా కనిపించింది. కానీ టాపార్డర్ వైఫల్యంతో బ్రిటీష్ జట్టు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. 48.1ఓవర్లలో 253 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంకా చదవండి
దాయాది సెమీస్ ఆశలు సజీవం , డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో పాక్ విజయం
ప్రపంచకప్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజయం సాధించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో పాక్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. పాక్ బ్యాటర్ ఫకార్ జమాన్ విధ్వంసంతో భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా పయనించింది ఆ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో లక్ష్యాన్ని తగ్గించారు. అనంతరం మళ్లీ వర్షం పడడంతో పాక్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంకా చదవండి