ABP Cvoter Opinion Polls:    రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అశోక్ గెహ్లాట్ తన  పథకాల ఆధారంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి వచ్చేందుుకు ప్రయత్నిస్తున్నారు. అయితే రాజస్తాన్‌లో ఒకే పార్టీ రెండు సార్లు వరుసగా అధికారం ఇవ్వడం అనేది ఇటీవలి కాలంలో జరగలేదు.  ఏబీపీ న్యూస్, సీఓటర్ సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంది. ఇందులో  అదే సంప్రదాయం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. 
 
రాజస్థాన్‌లో ఎవరికి ఎన్ని సీట్లు?


ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వేలో ఈసారి రాజస్థాన్ లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రజలను ప్రశ్నించింది.  కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రజలు జోస్యం చెప్పారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ కు 67 నుంచి 77 సీట్లు, బీజేపీకి 114 నుంచి 124 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ఇతరులు 5 నుంచి 13 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే అంచనా  వేసింది.


రెండు పార్టీల మధ్య మూడు శాతం ఓట్ల తేడా 


ఓట్ల శాతం విషయానికొస్తే ఈ సర్వే ప్రకారం రాజస్థాన్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్దగా తేడా లేదు. ఇందులో బీజేపీకి 45 శాతం, కాంగ్రెస్ కు 42 శాతం ఓట్లు వస్తాయి. ఇతరులకు 13 శాతం ఓట్లు రావచ్చని ఓపీనియన్ పోల్‌లో వెల్లడయింది. 


ఒపీనియన్ పోల్ ప్రకారం : 


రాజస్థాన్ - మొత్తం సీట్లు- 200


కాంగ్రెస్ - 67-77
బీజేపీ - 114-124
ఇతర -5-13


ఓట్ల శాతం
 
కాంగ్రెస్ - 42%
బీజేపీ - 45%
ఇతరులు - 13%




ఓటింగ్ ఎప్పుడు?


ఛత్తీస్ గఢ్ లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ లో నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 25న రాజస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. నవంబర్ 7న పోలింగ్ జరిగే చోట రేపు సాయంత్రానికి ప్రచారం ముగియనుంది.                                              


Disclaimer :    5 రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఛత్తీస్ గఢ్ లో తొలి దశ సీట్లతో మిజోరంలో ప్రచారం రేపు సాయంత్రం ముగియనుంది. ఏబీపీ న్యూస్ కోసం సీ ఓటర్ మొత్తం 5 రాష్ట్రాల్లో తుది ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 63 వేల మందితో మాట్లాడారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 3 వరకు ఈ చర్చలు జరిగాయి. సర్వేలో తప్పుల మార్జిన్ మైనస్ 3 నుంచి మైనస్ 5 శాతం వరకు ఉంటుంది.