'ఘోస్ట్' సినిమా రివ్యూ : శివ రాజ్‌కుమార్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
కన్నడ కథానాయకుడు శివ రాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి', రజనీకాంత్ 'జైలర్' సినిమాల్లో అతిథి పాత్రలు చేశారు. రామ్ గోపాల్ వర్మ 'కిల్లింగ్ వీరప్పన్'లో హీరోగా నటించారు. విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 19న కన్నడలో విడుదలైన ఆయన 'ఘోస్ట్' సినిమా తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


పొగలు కక్కే చలిలో సమంత, నెట్టింట్లో కైరో థెరపీ వీడియో వైరల్
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. కొంత కాలం పాటు ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న ఆమె, ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటించింది. కొద్ది కాలం క్రితం మూవీస్ కు   పూర్తి స్థాయిలో విరామం ప్రకటించింది. కంప్లీట్ గా తన హెల్త్ మీదే ఫోకస్ పెట్టింది. మయోసైటిస్‌ నుంచి బయటపడటంతో పాటు మానసిక ప్రశాంతంత పొందేందుకు ప్రయత్నిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సామ్ నుంచి జాన్వీ వరకూ.. డీ గ్లామర్ రోల్స్ లో గ్లామరస్ హీరోయిన్స్
వారానికో కొత్త భామ పరిచయం అవుతున్న సినీ ఇండస్ట్రీలో, హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ కాదు. ఈ గ్లామర్ ఫీల్డ్ లో యాక్టింగ్, టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. కాస్త గ్లామర్ కూడా ఉండాలి. అవసరమైతే స్కిన్ షో కూడా చెయ్యాలి. అయితే కేవలం గ్లామర్ షోతోనే ఇండస్ట్రీలో నెట్టుకురావాలంటే కుదరదు. అన్ని రకాల పాత్రల్లో ఆడియన్స్ ను మెప్పించగలిగితేనే ఎక్కువకాలం రాణించగలుగుతారు. కథ నచ్చితే ఎలాంటి రోల్స్‌ చేయడానికైనా సిద్ధపడే హీరోయిన్లు ఇప్పుడు మన టాలీవుడ్ లో ఉన్నారు. పాత్ర డిమాండ్ చేస్తే డీ గ్లామర్ గా కనిపించడానికి కూడా రెడీ అంటున్నారు. ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే, మరోవైపు రా అండ్ రస్టిక్ క్యారెక్టర్లు చేస్తున్నారు. అలాంటి ముద్దుగుమ్మలపై ఓ లుక్కేద్దాం! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'హాయ్ నాన్న' థర్డ్ సింగిల్ వచ్చేసింది, నాని, మృణాల్ కెమిస్ట్రీ అదుర్స్ అంతే!
‘దసరా’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు ‘హాయ్ నాన్న’ సినిమాతో ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కొద్ది రోజుల క్రితం మ్యూజిక్ ప్రమోషన్ మొదలు పెట్టిన చిత్రబృందం వరుసగా పాటలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి.  ఫస్ట్ సింగిల్ 'సమయమా' పాటలో నాని, మృణాల్ ఠాకూర్ మధ్య లవ్ ప్రేమను చూపించగా, రెండో పాట 'గాజు బొమ్మ'లో తండ్రి, కూతురు మధ్య అందమైన అనుబంధాన్ని ఆవిష్కరించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'గుంటూరు కారం'లో 'దమ్ మసాలా' - ఫస్ట్ సాంగ్ ప్రోమో రేపే
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. వాళ్ళు ఎప్పటి నుంచో 'గుంటూరు కారం' సినిమాలో ఫస్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణలు ఫలించాయి. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయ్యింది. 'గుంటూరు కారం' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'దమ్ మసాలా...' ప్రోమోను రేపు (అంటే... ఆదివారం) ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)