సౌత్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. కొంత కాలం పాటు ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న ఆమె, ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటించింది. కొద్ది కాలం క్రితం మూవీస్ కు   పూర్తి స్థాయిలో విరామం ప్రకటించింది. కంప్లీట్ గా తన హెల్త్ మీదే ఫోకస్ పెట్టింది. మయోసైటిస్‌ నుంచి బయటపడటంతో పాటు మానసిక ప్రశాంతంత పొందేందుకు ప్రయత్నిస్తోంది.


హెల్త్ అప్ డేట్ ఇచ్చిన సమంత


సమంత తరచుగా ఫారిన్ వెకేషన్స్ కు వెళ్తూ మానసిక ఉల్లాసాన్ని పొందుతోంది. రీసెంట్ గా బాలిలో హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేసింది. తన మిత్రులతో కలిసి సరదాగా గడుపుతూ కనిపించింది. కొద్ది కాలం పాట అమెరికాలోనూ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన హెల్త్ కు సంబంధించి సమంత ఓ చిన్న అప్ డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఆమె ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం కైరో థెరపీ చేయించుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ ట్రీట్మెంట్ కు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా స్టేటస్‌ లో షేర్ చేసింది. ఇందులో ఆమె పొగలు కక్కే చిలో ఓ టబ్ లో కూర్చుని కనిపించింది. చలి తీవ్రత -150 డిగ్రీల ఫారెన్​ హీట్​ ఉన్నట్లు అక్కడ డిస్ ప్లే లో కనిపిస్తోంది.  


కైరో థెరపీతో లాభం ఏంటంటే?


ఇంతకీ కైరో థెరపీ అంటే ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే విషయాలను ఆమె తన వీడియోతో  జత చేసింది. మానవ శరీరంలో బలహీన పడిన ఇమ్యూనిటీ వ్యవస్థను మళ్లీ యాక్టివేట్ చేయడానికి కైరో థెరపీ ఉపయోగపడుతుందని వెల్లడించింది. అంతేకాదు, ఇతర వ్యాధుల నుంచి ఈ ప్రక్రియ సమర్థవంతంగా రక్షిస్తుందని తెలిపింది. "వ్యాధి కారక క్రిములతో పోరాడే తెల్ల రక్తకణాలు కైరో థెరపీతో పెరుగుతాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేసి, దేహం అంతా హీలింగ్ కాంపౌండ్స్ ​ను సరఫరా చేస్తుంది. మెంటల్ హెల్త్ తో పాటు శక్తిని కూడా అందిస్తుంది. శరీరంలో పలు కీలక మార్పులు చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది” అని సమంతా వెల్లడించింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు నిత్యం వ్యాయామాలు చేస్తూ కనిపిస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. మరోవైపు గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును కవ్విస్తోంది.  


ఇక సమంత చివరగా ‘ఖుషి’ సినిమాలో కనిపించింది. విజయ్ దేవరకొండతో కలిసి ఈ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ టాక్ అందుకుంది. ఇక త్వరలోనే వరుణ్ ధావన్ తో కలిసి నటించిన  ‘సిటాడెల్‌’ ఇండియన్ వెర్షన్​ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  హాలీవుడ్ లో రుస్సో బ్రదర్స్‌ దీన్ని తెరకెక్కించగా,  రాజ్‌ అండ్‌ డీకే ఇండియన్ ఆడియెన్స్ కు అనుకూలంగా మార్పులు చేసి రూపొందించారు. అటు సమంత సల్మాన్ తో కలిసి త్వరలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.   


Read Also: షారుక్ బర్త్ డే వేడుకలో రెచ్చిపోయిన దొంగలు, ఏకంగా 30 ఫోన్లు కొట్టేశారు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial