బాలీవుడ్ స్టార్స్ బర్త్ డేలకు అభిమానులు చేసే హడావిడి మామూలుగా ఉండదు. అర్థరాత్రి సమయంలో అభిమాన హీరో ఇంటికి భారీ సంఖ్యలో చేరి శుభాకాంక్షలు చెప్తారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ బర్త్ డే అంటే ఏ రేంజ‌్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆయన ప్రతి బర్త్ డే రోజున అర్థరాత్రి సమయంలో అభిమానులు ముంబైలోని తన నివాసం ‘మన్నత్’ ముందు వేలాదిగా గుమిగూడుతారు. అభిమాన హీరోకు బర్త్ డే విషెస్ చెప్పి సంతోషం వ్యక్తం చేస్తారు.
అట్టహాసంగా షారుఖ్ బర్త్ డే వేడుకలు
తాజాగా షారుఖ్ ఖాన్ 59వ బర్త్ డే జరుపుకున్నారు. నవంబర్ 2న ఆయన 58 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో ఆయన నివాసం ముందు అభిమానులు గుమిగూడారు. షారుఖ్ ఖాన్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా తన అభిమానులతో షారుకు కాసేపు మాట్లాడారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు."చాలా మంది అభిమానులు ఇంత రాత్రి సమయంలో వచ్చిన నాకు శుభాకాంక్షలు చెప్పారు. ఏటా వచ్చే అభిమానుల సంఖ్య పెరగడం సంతోషంగా ఉంది. నేను కేవలం నటుడిని మాత్రమే. నేను మిమ్మల్ని సినిమాల ద్వారా కొంతమేర అలరిస్తున్నాను. అదేనాకు చాలా సంతోషం. ఇంత మంది అభిమానులను సంపాదించుకోవడం సంతోషంగా ఉంది. నాకు బర్త్ డే శుభకాంక్షలు చెప్పేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు” అని చెప్పారు.
షారుఖ్ అభిమానుల ఫోన్లు కొట్టేసిన దొంగలు
అయితే, షారుఖ్ కోసం వచ్చిన అభిమానులతో ‘మన్నత్’ ప్రాంతం అంతా జనసందోహంగా మారింది. ఇదే మంచి తరుణం అనుకున్న దొంగలు తమ చేతులకు పని చెప్పారు. గుమి గూడిన జనాల నుంచి ఏకంగా 30కి పైగా సెల్ ఫోన్లు కొట్టేశారు. ఆ తర్వాత ఫోన్లు పోయిన విషయాన్ని తెలుసుకుని షారుఖ్ అభిమానులు షాక్ కు గురయ్యారు. పెద్ద మొత్తంలో సెల్ ఫోన్ల దొంగతనం జరగడం పట్ల పోలీసులు అలెర్ట్ అయ్యారు. బాంద్రా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
క్రిస్మస్ కానుకగా ‘డుంకీ’ విడుదల
షారుఖ్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన అభిమానుల కార్యక్రమానికి డుంకీ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ, రైటర్ అభిజత్ జోషి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా షారుఖ్ తన తర్వాతి చిత్రం ‘డుంకీ’ గురించి చాలా విషయాలు చెప్పారు. ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల్లోని పాటలు పాడుతూ అలరించారు. ఇక షారుఖ్ చివరి సారిగా యాక్షన్ థ్రిల్లర్ ‘జవాన్’ మూవీలో కనిపించారు. ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆయన తాజాగా నటించిన ‘డుంకీ’ సినిమా కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో తాప్సీ, విక్కీ కౌషల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: అందుకే రాహుల్ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు - రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial