Guntur Kaaram First Single : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్. వాళ్ళు ఎప్పటి నుంచో 'గుంటూరు కారం' సినిమాలో ఫస్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణలు ఫలించాయి. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
'గుంటూరు కారం'లో దమ్ మసాలా
'గుంటూరు కారం' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'దమ్ మసాలా...' ప్రోమోను రేపు (అంటే... ఆదివారం) ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే... ఆ విషయం ఇవాళ చెప్పలేదు. రేపు సాంగ్ ప్రోమోతో పాటు వెల్లడించే అవకాశం ఉంది.
మసాలా బిర్యానీ... దమ్ మసాలా... ఒక్కటేనా?
'గుంటూరు కారం' గురించి శుక్రవారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే రచ్చ. 'మసాలా బిర్యానీ' అంటూ సాగే సాంగ్ బిట్ ఒకటి లీక్ అయ్యింది. ఇప్పుడు ఆ సాంగ్, రేపు విడుదల చేయబోయే 'మసాలా బిర్యానీ' సాంగ్ ఒక్కటేనా? అని మహేష్ బాబు అభిమానుల్లో చర్చ మొదలైంది. సంగీత దర్శకుడు తమన్ ఎటువంటి సాంగ్ ఇచ్చారోనని ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.
Also Read : 'ఘోస్ట్' సినిమా రివ్యూ : శివ రాజ్‌కుమార్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విచిత్రం ఏమిటంటే... కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమాలో 'జరగండి జరగండి' సాంగ్ కూడా లీక్ అయ్యింది. కట్ చేస్తే... అది ఫస్ట్ సింగిల్ అని, దీపావళికి విడుదల చేస్తామని ఆ సినిమా యూనిట్ పేర్కొంది. ఇప్పుడు సేమ్ టు సేమ్... 'గుంటూరు కారం' సాంగ్ లీక్ అని సోషల్ మీడియా అంతా చర్చ మొదలైన తర్వాత ఫస్ట్ సింగిల్ గురించి అప్డేట్ వచ్చింది. రెండు సినిమాలకు సంగీత దర్శకుడు తమన్ కావడం గమనార్హం.
Also Read : ఆ పెళ్లి కొడుకు ఎవరో నాకూ చెప్పండయ్యా - అల్లు కామెంట్స్ వైరల్ కావడంతో హీరోయిన్ క్లారిటీ
'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో 'గుంటూరు కారం' రూపొందుతోంది. దీంతో హ్యాట్రిక్ ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మహేష్ బాబును ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా మాస్ అవతారంలో త్రివిక్రమ్ చూపిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ప్రొడ్యూస్ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి సినిమా రానుంది. ఆ రోజు తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హను - మాన్', తర్వాత రోజు (జనవరి 13న) విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'సైంధవ్', మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న 'ఈగల్' సినిమాలు కూడా వస్తున్నాయి.