Upcoming Hybrid SUVs: హైబ్రిడ్ ఎస్‌యూవీలు ఇటీవలి కాలంలో భారతీయ కార్ల మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందాయి. ఆటోమోటివ్ పరిశ్రమ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల వైపు గణనీయమైన మార్పుకు లోనవుతున్నాయి. హైబ్రిడ్ వాహనాలు ఇంధన ఖర్చులను ఆదా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రేంజ్ గురించి టెన్షన్ లేదా హోం ఛార్జింగ్ అవసరం లేకుండా వాటి కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించగలవు. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి సుజుకి ఇన్విక్టో, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా హారియర్, సఫారీ వంటి అనేక హైబ్రిడ్ ఎస్‌యూవీ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.


2024 టయోటా ఫార్చ్యూనర్
టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ కొత్త తరం మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని విక్రయాలు 2024లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. కొత్త ఫార్చ్యూనర్ 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. ఇది పనితీరు, భద్రత, ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. అదనంగా టయోటా కరోలా క్రాస్ ఆధారంగా 7 సీటర్ ఎస్‌యూవీని పరిచయం చేయాలని యోచిస్తుంది. ఇందులో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉండనుంది. అయితే ఇది మార్కెట్‌కి చేరుకోవడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టవచ్చు.


మారుతీ హైబ్రిడ్ ఎస్‌యూవీ
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఆధారంగా మూడు వరుసల ఎస్‌యూవీని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సుజుకి గ్లోబల్ సీ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఈ ఎస్‌యూవీ రెండు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 1.5 లీటర్ కే15సీ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఉన్నాయి. అయితే దీని లాంచ్ టైమ్‌లైన్‌కు సంబంధించి అధికారికంగా ఎటువంటి నిర్ధారణ చేయలేదు.


ఫోక్స్‌వ్యాగన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ
ఫోక్స్‌వ్యాగన్ టూరాన్ 7 సీటర్ ఎస్‌యూవీని భారతదేశంలోకి తీసుకురావడాన్ని పరిశీలిస్తున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మోడల్ ఎంక్యూబీ-ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో సీకేడీ (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్‌గా అసెంబుల్ చేయవచ్చు. టెరాన్‌ను 2025 నాటికి ఫోక్స్‌వ్యాగన్ భారతదేశంలో ప్రారంభించవచ్చు. భారతీయ హైబ్రిడ్ ఎస్‌యూవీ మార్కెట్లోకి ఫోక్స్‌వ్యాగన్ ప్రవేశించాక మరింత పర్యావరణ అనుకూలమైన ఎస్‌యూవీ ఆప్షన్లను వినియోగదారులకు అందించగలదని అందరూ భావిస్తున్నారు.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!