‘గద్దలకొడ గణేష్’ మూవీ చూసినవారికి ‘జిగర్ తండ’ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళంలో సూపర్, డూపర్ హిట్ కొట్టిన ‘జిగర్ తండా’ మూవీనే తెలుగులో వరుణ్ తేజ్‌తో రీమేక్ చేశారు. కానీ, అది ఆశించిన స్థాయిలో విజయం సాధించాలేదు. కేవలం పాటలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లాయి. 2014లో రిలీజైన ఈ మూవీకి సుమారు పదేళ్ల తర్వాత ప్రీక్వెల్ సిద్ధమైంది. అదే.. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ఇందులో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 


కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘జిగర్ తండ’ తరహాలోనే ఇది కూడా ఓ ఫిలిం మేకర్, గ్యాంగ్ స్టార్ చుట్టూ తిరిగే కథ ఇది. అయితే, ఈ సారి హీరో అవ్వాలనుకుంటున్న గ్యాంగ్ స్టర్ ఓ దర్శకుడితో సినిమా తీయించుకోవడంతో కథ మొదలవుతుందని తెలుస్తోంది. ఇందులో గ్యాంగ్ స్టర్‌గా రాఘవా లారెన్స్, దర్శకుడి పాత్రలో ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. ఇందులో లారెన్స్ పక్కా మాస్ గెటప్‌లో కనిపించాడు. చెప్పాలంటే ఆ పాత్రలో జీవించాడు. 


ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘‘పాన్ ఇండియాలో ఇప్పుడు వచ్చే సినిమాల్లో.. అతనిలాంటి ఒక నల్లని హీరోను ఊహించుకుని చూడండి చూద్దాం’’ అంటూ మొదలైంది. ‘‘నలుపు అంటే అంత చులకనా నీకు’’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్ నడిచింది. ‘‘సినిమాల్లో హీరో అంటే తెల్లగానే ఉండాలిగా మరి’’ అనే మరోకరి గొంతు వినిపిస్తుంది. ‘‘తెలుగు సినిమాలో మొదటి నల్ల హీరో అంటూ.. గుర్రంపై వస్తున్న లారెన్స్‌ను స్టైలిష్‌గా చూపించారు. 


ఆ తర్వాత ‘‘నువ్వే గొప్ప హిస్టీరియా సృష్టించే పాండ్య సినిమా డైరెక్టర్ అంటూ ఎస్ జే సూర్య పాత్రను పరిచయం చేశారు. ‘‘నేను రే దాశన్. తెలుగు సినిమా దర్శకుడిని. నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా సత్యజిత్ రే దగ్గర పనిచేస్తున్నప్పుడు. ఒక రోజు ఆయన నన్ను పిలిచి.. అరె సాలా ముజ్‌కో లగ్ రహా మై కి తుమ్ ఏక్ దమ్ తయార్ హోగయా. జాకే సినిమా కరో (నువ్వు రెడీగా అయ్యావు వెళ్లి సినిమా తీసుకో) అని ఆశీర్వదించి.. నన్ను సినిమా తియ్యమని పంపించారు’’ అని సూర్య.. లారెన్స్‌కు చెబుతాడు. ఆ తర్వాత కొన్ని థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ సాగింది. ఈ మూవీలో 


ఇందులో డైరెక్టర్ పాత్రలో ఎస్ జె సూర్య, గ్యాంగ్ స్టర్ పాత్రలో రాఘవ లారెన్స్ నటించారు. తాజాగా విడుదలైన టీజర్ లో లారెన్స్ గన్స్ పట్టుకొని బీడీ తాగుతూ పక్కా మాస్ అవతార్లో కనిపించగా, SJ సూర్య సూట్ వేసుకొని స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక టీజర్ లో అన్ని భాషల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా కేవలం ఇంగ్లీష్ డైలాగ్స్ మాత్రమే పెట్టారు. 1975లో జరిగిన కథగా ఈ సీక్వెల్ని తెరకెక్కించారు. దాంతో ఆ కాలంలోకి తీసుకెళ్లడానికి మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేసినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక టీజర్ చివర్లో రాఘవ లారెన్స్ ఓ ఫన్నీ డైలాగ్ తో ఆకట్టుకున్నారు. పాన్ ఇండియా అనే దానిని పాండియా వెస్టర్న్ అంటూ లారెన్స్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. 


ఇందులో తెలుగు నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు షైన్ టామ్ చాకోలు విలన్ పాత్రలో కనిపించారు. నవీన్ చంద్ర.. డాన్ లారెన్స్‌ను వెంటాడే పోలీస్ అధికారి. ‘‘ఓ సినిమా అన్న దేశభక్తులు గురించి సినిమా చేయొచ్చు కదా..’’ అనే డైలాగ్‌కు సూర్య.. ‘‘ఈ రోజుల్లో మంచోళ్లపై సినిమా తీస్తే ఎవరూ చూడరమ్మ’’ అని అంటాడు. ‘‘అతడు ఎప్పటికైనా మార్తాడు. నువ్వు తీసే సినిమా మారుస్తుందని నాకు అనిపిస్తోంది’’ అని నిమిషా అంటుంది. ఆ తర్వాతి సీన్‌లో ‘‘రే సార్, నా స్వీయ చరిత్రను కాస్త మార్చి రాద్దామా’’ అని లారెన్స్ అంటాడు. ఇక్కడ ఎవరు ఏదీ కొత్తగా రాయలేరు. కలం గట్టిగా పట్టుకుంటే చాలు. రాయబడిందే రాయబడుతుంది’’ అని సూర్య అంటాడు. ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి కథ, దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన సొంత బ్యానర్ స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ పై ఈ మూవీ రూపొందింది. నవంబరు 10న ఈ మూవీ రిలీజ్ కానుంది. 


‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ తెలుగు ట్రైలర్ ( Jigarthanda DoubleX Telugu Trailer ):



Also Read 'ఘోస్ట్' సినిమా రివ్యూ : శివ రాజ్‌కుమార్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?