లండన్‌ బయలుదేరిన సీఎం జగన్‌


ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరారు. సీబీఐ కోర్టు అనుమతి లభించడంతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్‌ బయలుదేరారు జగన్. గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చి సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రులు, ప్రజా ప్రతినిధులు జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఉన్నతాధికారులు సీఎం జగన్ కు వీడ్కోలు పలికారు. ఇంకా చదవండి


గజ్వేల్‌ ఏమైనా సీఎం కేసీఆర్‌ ప్రైవేటు ఆస్తి అనుకుంటున్నారా: కిషన్ రెడ్డి


గజ్వేల్‌ నియోజకవర్గం సీఎం కేసీఆర్‌ ప్రైవేటు ఆస్తి అనుకుంటున్నారా? అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శుక్రవారం కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు వెళ్తున్న బీజేపీ నేత రమణారెడ్డి, కార్యకర్తలను పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇంకా చదవండి


ఆ నలుగురిలో ప్రత్యేకంగా కోటంరెడ్డి


అధికారంలో ఉన్న పార్టీకి దూరం కావాలని సహజంగా ఏ నాయకుడూ అనుకోరు. ఒకవేళ తాము ఉన్న పార్టీ ఓడిపోతుందనుకున్నా.. సరిగ్గా ఎన్నికల టైమ్ లోనే గోడదూకుతారు. కానీ ఏడాదిపాటు అధికారాన్ని వదిలిపెట్టుకుని పార్టీకి దూరం జరిగారు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు. పార్టీ వేటు వేసిందా, వారే బయటొక్చేశారా అనే తర్కం పక్కనపెడితే, పార్టీ దూరం పెడుతోందని తెలిసి వారు టీడీపీ స్టాండ్ తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి చేకూర్చి బయటపడ్డారు. అయితే ఆ నలుగురు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వారి రాజకీయ భవిష్యత్ ఏంటి..? ఆ నలుగురిలో మిగతా ముగ్గురి కంటే ఓ అడుగు ముందున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇంకా చదవండి


టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. మరో విడత కరువు భత్యం(DA) ఇవ్వాలని TSRTC నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనున్నట్లు ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడించారు. ఇంకా చదవండి


ప్రశ్నోత్తరాలు లేకుండానే ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు!


సెప్టెంబర్ 18 నుంచి 22 తేదీ వరకు ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయం, ప్రైవేట్ కార్యకలాపాలు ఉండవని లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌ల నుంచి శనివారం అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. సెషన్‌లో ఐదు సిట్టింగ్‌లు ఉంటాయి. సభ్యులు విడిగా తాత్కాలిక క్యాలెండర్‌ని అందుకుంటారు. సెప్టెంబర్ 18 నుంచి 17వ లోక్‌సభ పదమూడో సమావేశాలు ప్రారంభమవుతాయని సూచిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్‌ విడుదల చేసింది. ఇంకా చదవండి


రోవర్ పనులు పూర్తి, ఇకపై స్లీప్‌ మోడ్‌లోకి - మళ్లీ చంద్రుడిపై సూర్యోదయం ఎప్పుడంటే


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్-3 లోని రోవర్ ప్రజ్ఞాన్ తన పనిని పూర్తి చేసినట్లుగా ప్రకటించింది. ఇక దాన్ని తాము సురక్షితంగా పార్క్ చేశామని వెల్లడించింది. రోవర్‌కు తాము ఇచ్చిన అసైన్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసినట్లుగా పేర్కొంది. ఈ మేరకు ఇస్రో X లో ఓ పోస్ట్ చేసింది. ‘‘చంద్రయాన్-3 రోవర్ తన అసైన్‌మెంట్‌ను పూర్తి చేసింది. ఇది ఇప్పుడు పార్క్, స్లీప్ మోడ్‌లో సురక్షితంగా సెట్ చేశాం. పేలోడ్‌లు APXS, LIBS రెండూ టర్న్ ఆఫ్ చేశాం. ఈ పేలోడ్‌ల నుంచి డేటా ల్యాండర్ ద్వారా భూమికి ట్రాన్స్‌మిట్ అయింది. రోవర్ బ్యాటరీ ప్రస్తుతం పూర్తిగా ఛార్జ్ అయి ఉంది. రోవర్ సోలార్ ప్లేట్స్ ను తర్వాతి సన్ లైట్ వచ్చేలా సెట్ చేసి ఉంచాం. మళ్లీ సెప్టెంబర్ 22, 2023న సూర్యోదయం వచ్చినప్పుడు.. సూర్యరశ్మి సోలార్ ప్యానెల్‌లపై పడుతుంది. రిసీవర్ ఆన్‌లో ఉంచాము. వచ్చే సూర్యోదయానికి రోవర్ మళ్లీ అవేక్ అవుతుందని భావిస్తున్నాం’’ అని ఇస్రో ప్రకటించింది. ఇంకా చదవండి


జమిలీ ఎన్నికలకు అసలైన సవాళ్లు ఎన్నో ! పరిష్కారాలను కోవింద్ కమిటీ సూచించగలదా?


దేశంలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక ఎన్నికలకు కూడా ఒకే సారి ఎన్నికలు జరిపేలా సూచనలు చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  18వ తేదీ నుంచి జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై బిల్లు పెట్టే అవకాశం ఉంది. కానీ ఇది అంత సులువు కాదని సుదీర్ఘ కాలంగా జరుగుతున్న చర్చలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకా చదవండి


మాస్ మానియా మొదలు - ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి అదిరిపోయే అప్డేట్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు స్పెషల్‌గా ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ అందుతున్నాయి. ఇప్పటికే పవన్ నటిస్తున్న ‘ఓజీ’ నుండి టీజర్ విడుదలయ్యి ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది. ఇక ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’ టర్న్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి మాస్ మానియా మొదలు అంటూ పవన్ ఫేస్ కనిపించకుండా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఆ అప్డేట్ సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల అవుతుందని కూడా అనౌన్స్ చేసింది. అయితే ఆ అప్డేట్ ఏంటి అని మాత్రం పూర్తిగా క్లారిటీతో చెప్పలేదు. ఫైనల్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి ఒక మాస్ పోస్టర్ విడుదల చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది మూవీ టీమ్. ఇంకా చదవండి


రూ.2000 నోట్ల విత్‌డ్రా బాగానే వర్కౌట్‌ అయింది, కొత్త అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ


రెండు వేల రూపాయల నోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ విత్‌డ్రా చేసిన తర్వాత, ప్రజల వద్ద ఉన్న పింక్‌ నోట్ల క్రమంగా తిరిగి బ్యాంకుల వద్దకు వస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇచ్చిన తాజా అప్‌డేట్‌ ప్రకారం... చలామణీలో ఉన్న రూ. 2000 నోట్లలో 93 శాతం నోట్లు బ్యాంకుల వద్దకు వచ్చాయి. ఈ లెక్కన ఇప్పుడు మార్కెట్‌లో 7 శాతం నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా చదవండి


క్రికెట్‌లో మిస్ అయినా హాకీలో కొట్టారు


దాయాది దేశాల మధ్య అత్యంత ఆసక్తి రేపిన  క్రికెట్  పోరు  వర్షం కారణంగా నీరుగారిపోయినా  హాకీలో మాత్రం మనోళ్లకు ఎదురులేదు. పాకిస్తాన్‌పై భారత హాకీ జట్టు ఘనవిజయాన్ని అందుకుని టోర్నీ విజేతగా నిలిచింది.  క్రికెట్‌‌లో మాదిరిగానే  అభిమానులను అత్యంత ఉత్కంఠకు గురిచేసిన పోరులో  భారత్.. షూటౌట్‌లో  పాక్‌ను మట్టికరిపించింది. శనివారం సలాలా (ఓమన్) వేదికగా ముగిసిన  ఆసియా కప్ ఫైవ్స్ హాకీ టోర్నమెంట్‌లో భారత్..  2-0 (4-4) తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి టోర్నీ విజేతగా నిలిచింది. ఇంకా చదవండి