Ustaad Bhagat Singh: మాస్ మానియా మొదలు - ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి అదిరిపోయే అప్డేట్!

ఫైనల్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి ఒక మాస్ పోస్టర్ విడుదల చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది మూవీ టీమ్.

Continues below advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు స్పెషల్‌గా ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ అందుతున్నాయి. ఇప్పటికే పవన్ నటిస్తున్న ‘ఓజీ’ నుండి టీజర్ విడుదలయ్యి ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది. ఇక ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’ టర్న్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి మాస్ మానియా మొదలు అంటూ పవన్ ఫేస్ కనిపించకుండా ఒక పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఆ అప్డేట్ సాయంత్రం 6.03 నిమిషాలకు విడుదల అవుతుందని కూడా అనౌన్స్ చేసింది. అయితే ఆ అప్డేట్ ఏంటి అని మాత్రం పూర్తిగా క్లారిటీతో చెప్పలేదు. ఫైనల్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి ఒక మాస్ పోస్టర్ విడుదల చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది మూవీ టీమ్.

Continues below advertisement

11 ఏళ్ల తర్వాత..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఎంతోమంది ఫ్యాన్స్ డైరెక్ట్ చేశారు. కానీ అందులో అందరికంటే హైలెట్ బ్లాక్‌బస్టర్‌ను పవన్‌కు అందించింది మాత్రం హరీష్ శంకరే. హరీష్ శంకర్‌తో కలిసి ‘గబ్బర్‌సింగ్’ చేయక ముందు వరకు పవన్ చాలా ఫ్లాపుల్లో ఉన్నాడు. కానీ ఒక్కసారిగా తన ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకునేలా చేసిన సినిమా ‘గబ్బర్‌సింగ్’. రీమేక్ చిత్రం కదా.. ప్రేక్షకులు చూస్తారో లేదో, ఆదరిస్తారో లేదో అని అనుమానాలతో ఈ మూవీ మొదలయినా కూడా పవన్‌ను ఫ్లాపుల్లో నుండి బయటపడేయడం మాత్రమే కాకుండా బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించింది. అయితే ‘గబ్బర్‌సింగ్’ వచ్చి ఇప్పటికీ 11 ఏళ్లు అయిపోయింది. మళ్లీ వీరు కలిసి ఎప్పుడు సినిమా చేస్తారా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ ఊరటనిచ్చింది.

‘తేరీ’ రీమేక్‌గా..
11 సంవత్సరాల తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేస్తున్నారని, దాని టైటిల్ ‘భగవదీయుడు భగత్ సింగ్’ అని మూవీ టీమ్ మొదట్లోనే అనౌన్స్ చేసింది. కానీ ఏమైందో తెలియదు ఆ టైటిల్‌ను ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మార్చింది. ఒకసారి ‘గబ్బర్‌సింగ్’ను రీమేక్‌గా తెరకెక్కించి హిట్ కొట్టడంతో ఇప్పుడు కూడా మరోసారి ఆ ఫార్ములా హిట్‌ను అందిస్తుంది అన్న నమ్మకంతో తమిళ సూపర్ హిట్ మూవీ ‘తేరీ’ని తెలుగులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా రీమేక్ చేస్తున్నాడు హరీష్ శంకర్. కానీ ‘తేరీ’లోని కథను మాత్రం తీసుకొని పూర్తిగా మార్పులు చేర్పులు చేసినట్టుగా మూవీ టీమ్ పలుమార్లు తెలిపింది. పవన్.. తన రాజకీయ లైఫ్‌లో బిజీగా ఉండడంతో.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఇక ఆగిపోయినట్టే అని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసి ఇప్పటికే హరీష్ శంకర్.. ఆ వార్తలకు గట్టి సమాధానమే ఇచ్చాడు.

ఫుల్ మాస్ పోస్టర్..
ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి ‘ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అనే క్యాప్షన్‌తో ఒక ఫుల్ మాస్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ పోస్టర్‌లో పవన్ లుంగీ కట్టుకొని, చేతిలో ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఆ కత్తికి పూర్తిగా రక్తం ఉంది. ఈ మాస్ పోస్టర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నా.. మరికొందరు ప్రేక్షకులు మాత్రం చూడడానికి ఇది ‘భీమ్లా నాయక్’ లుక్‌లాగా ఉంది అంటూ విమర్శిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. పోస్టర్ చూసి సంతోషపడుతున్నా కూడా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇవ్వనందుకు ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ లుక్ & గన్స్ నుంచి కథ వరకు - 'ఓజీ' టీజర్‌లో ఇవి గమనించారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement