చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్


ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చంద్రబాబు బీపీ సాధారణంగానే ఉండగా, ఫిజికల్ యాక్టివిటీ బాగున్నట్లు రాజమండ్రి జైలు అధికారులు తెలిపారు. నిమిషానికి 12 సార్లు శ్వాస తీసుకుంటుండగా, నిమిషానికి 62 సార్లు గుండె కొట్టుకుంటున్నట్లు (Chandrababu Heart Rate) హెల్త్ బులెటిన్ లో వెల్లడించారు. ఊపిరితిత్తులకు ఏ సమస్యా లేదని చంద్రబాబు యాక్టివ్ గానే ఉన్నారని డాక్టర్ల టీమ్ జైలు అధికారులకు వివరించారు. ఇంకా చదవండి


వైసీపీ తెగులుకు వ్యాక్సిన్ మేమే, ఆ ఓట్లు చీలనివ్వం - పవన్ కల్యాణ్


ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీ నియంత విధానాల తెగులు పోవాలంటే అందుకు టీడీపీ - జనసేన వ్యాక్సిన్ మాత్రమే మందు అని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన - టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ పమావేశంలో పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ అధ్యక్షతన జరగ్గా. రెండు పార్టీల తరపున ముఖ్య నేతలు హాజరు అయ్యారు. ఇంకా చదవండి


వరంగల్ పశ్చిమలో త్రిముఖ పోటీ - దాస్యం వినయ్ భాస్కర్ కు చెక్ పెడతారా!


ఓరుగల్లు రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలకు మూలకేంద్రంగా ఉంటుంది హన్మకొండ (వరంగల్ పశ్చిమ). విద్యావంతులు, మేధావులు, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే నేతలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉంటారు. హన్మకొండ నగరం మొత్తం వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంటుంది. హన్మకొండ రాజకీయంగా చైతన్యం ఉన్న గడ్డ. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉన్నా రూలింగ్ పార్టీదే హవా కొనసాగుతుంది. విద్యావంతులు, మేధావుల అడ్డగా ఉన్న హన్మకొండలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కు పట్టున్నా... ప్రజలు గులాబీ పార్టీకే పట్టంకడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో  వరంగల్ పశ్చిమలో త్రిముఖ పోటీ నెలకొంది. ఇంకా చదవండి


సీఎం అవ్వాలనుంది, ఇంకో పదేళ్లలో ముఖ్యమంత్రి అవుతా - జగ్గారెడ్డి


తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని మనసులో మాట బయట పెట్టారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పది సంవత్సరాల్లో తాను సీఎం అవుతానని అన్నారు. దసరా ఉత్సవాలను సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించగా, ఆ వేడుకల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. విజయదశమి నాడు తన మనసులో మాట చెబుతున్నానని అన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి


డైనమిక్ కళ్యాణ్ రామ్ - 'డెవిల్'లో నందమూరి హీరో రాయల్ లుక్!


కథానాయకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయాణం చాలా వైవిధ్యమైనది. కేవలం కమర్షియల్ హంగులు ఉన్న కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా... ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన సినిమా చూపించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన ఎంపిక చేసుకునే పాత్రలు, కథలు ప్రేక్షకులు అందరినీ మెస్మరైజ్‌ చేస్తుంది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. 'డెవిల్'తో మరోసారి కొత్త కథను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇంకా చదవండి


'గేమ్ ఛేంజర్' ఫస్ట్ సింగిల్ అప్డేట్: లీకైన పాటనే అఫిషియల్ గా రిలీజ్ చేస్తున్నారుగా!


మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్‌ షణ్ముగం దర్శకత్వంలో వహిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. పవర్‌ ఫుల్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ లో చెర్రీ తండ్రీకొడులుగా రెండు విభిన్నమైన లుక్స్‌ లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మెగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. అయితే చాలా కాలంగా మరో అప్డేట్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ తో వచ్చారు. ఇంకా చదవండి


చిన్నారుల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు, గాజా ఆస్పత్రుల్లో కమ్ముకున్న చీకట్లు


ఇజ్రాయెల్‌ సైన్యం గాజా నగరంపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రెండు వారాలకు పైగా కొనసాగుతున్న బాంబుదాడుల్లో పాలస్తీనాలో చిన్నారులు, మహిళలతో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. విద్యుత్ సరఫరా కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. వివిధ ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల ఆరోగ్యంపై ఎన్‌ఐసీయూ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చదవండి


రూ.1000 నోట్లు మళ్లీ మార్కెట్‌లోకి వస్తాయా? క్లారిటీ ఇచ్చిన విశ్వసనీయ వర్గాలు


రూ.1000 నోట్లను మళ్లీ (Rs. 1000 Notes Re Introduction) మార్కెట్‌లోకి ప్రవేశపెడతారన్న ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే..విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..RBI అలాంటి ఆలోచనే లేదని తెలుస్తోంది. రీ ఇంట్రడక్షన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అసలు ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంది RBI. ఇకపై ఈ నోట్లు చెలామణిలో ఉండవని స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు గడువు కూడా ఇచ్చింది. 2016లో మోదీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంకా చదవండి


పాకిస్తాన్‌కు ఆఫ్ఘన్ల భారీ షాక్ - ఏకంగా ఎనిమిది వికెట్లతో ఘనవిజయం!


2023 ప్రపంచకప్‌లో మరో పెను సంచలనం నమోదైంది. పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ 49 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంకా చదవండి


పాయింట్ల పట్టికలో టాప్‌కు చేరిన భారత్ - ఈ టోర్నీలో ఏకైక అజేయ జట్టు!


ఐసీసీ టోర్నమెంట్‌ల్లో న్యూజిలాండ్‌పై 20 సంవత్సరాల తర్వాత భారత జట్టు విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన ప్రపంచ కప్ 2023 21వ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. ఈ విజయంతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానం సాధించింది. ఇది మ్యాచ్‌కు ముందు నంబర్ వన్ స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఓటమి తర్వాత న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. కాగా ప్రస్తుతం పాకిస్తాన్, ఇంగ్లండ్‌ల పరిస్థితి కాస్త డౌట్‌ఫుల్‌గా ఉంది. ఇంకా చదవండి