అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. అంటే డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ రోజు. అందుకే ఉదయం నుంచీ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కేకులు కట్ చేసి హంగామా చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ ను ఏర్పాటు చేసి తమ హీరోకి అదిరిపోయే గిఫ్ట్ అందించారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఆయన నటించే సినిమాల అప్డేట్స్ విషయంలో మాత్రం అభిమానులు హ్యాపీగా లేరని తెలుస్తోంది. బర్త్ డే స్పెషల్ గా ఒక్కటంటే ఒక్క మంచి అప్డేట్ రాకపోవడం వారిని తీవ్రంగా నిరాశ పరిచింది.


ప్రభాస్ ప్రస్తుతం 'సలార్' సినిమాతో పాటుగా 'కల్కి 2898 AD', మారుతి ‘రాజా డీలక్స్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులోనూ ఈసారి డార్లింగ్ పుట్టినరోజు, దసరా పండుగ ఒకేసారి రావడంతో స్పెషల్ అప్డేట్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుందని అభిమానులు భావించారు. 'సలార్' పార్ట్ 1 రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి కచ్చితంగా అందరికీ ఎగ్జైట్ చేసే పబ్లిసిటీ కంటెంట్ వదులుతారని అనుకున్నారు. కల్కి నుంచి కొత్త పోస్టర్, మారుతి మూవీ నుంచి వర్కింగ్ స్టిల్ వస్తుందని ఆశించారు. కానీ మేకర్స్ మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లారు.


KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ మూవీ 'సలార్'. ఫస్ట్ పార్ట్ ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరో అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తుండగా.. డార్లింగ్ బర్త్ డే స్పెషల్ గా అన్ని భాషల్లో ఓ పోస్టర్ వదిలారు. కానీ అది వారిని ఏమాత్రం ఎగ్జైట్ చేయలేదు. ఎందుకంటే అది ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన నాలుగు పోస్టర్స్ ను కలిపి ఎడిట్ చేసిన పోస్టర్. అందులో 'హ్యాపీ బర్త్ డే సలార్' అనే లైన్ తప్ప కొత్తగా ఏమీ లేదు. 


Also Read: యూఎస్ లో $1 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన బాలయ్య 'భగవంత్ కేసరి'


అలానే ఆయుధ పూజ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయుధాలతో ఓ పోస్టర్ ను పంచుకున్నారు హోంబులే మేకర్స్. కానీ అందులో అసలు ప్రభాస్ కు చోటే లేకపోవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవ్వలేదు. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD' సినిమా నుంచి కూడా ఎలాంటి అప్డేడ్ రాలేదు. 'సలార్' రిలీజ్ దగ్గర్లో ఉంది కదా అనుకున్నారో ఏమో, వాళ్ళు రిలీజ్ చేసిన ఎడిటెడ్ పోస్టర్ నే వైజయంతీ మూవీస్ టీం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రభాస్ కు బర్త్ డే విషెస్ అందజేశారు. మన సినిమా రిలీజ్ కి ఇంకా బోలెడంత టైం ఉంది.. ఇప్పుడు అప్డేట్ ఎందుకులే అనుకున్నారో ఏమో, Prabhas Maruthi మూవీ టీమ్ అసలు ఏమీ ప్లాన్ చెయ్యలేదు. ఇక అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన 'స్పిరిట్' సంగతి సరే సరి.


ఇలా డార్లింగ్ పుట్టినరోజు నాడు అభిమానులకు నిరాశే మిగిలింది. బర్త్ డేని మరింత ప్రత్యేకంగా మార్చే విషయాలు బయటకు వస్తాయని ఊహిస్తే.. మేకర్స్ మాత్రం ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు. దీంతో వారంతా సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తమ గోడుని వెళ్లబుచ్చుకుంటున్నారు. అయితే వారి బాధను మర్చిపోవడానికి ఆఫ్ లైన్ లో ప్రభాస్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్‌ లోని కూకట్ పల్లి ప్రాంతంలో 230 అడుగుల ఎత్తైన సలార్ కటౌట్‌ ను ఏర్పాటు చేసి ప్రభాస్‌ కు భారీ గిఫ్ట్ అందించారు. ఇది దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ గా రికార్డు సృష్టించడం విశేషంగా చెప్పుకోవాలి. 


Also Read: ఆసక్తి రేకెత్తిస్తోన్న నాని 'సరిపోదా శనివారం' ఫస్ట్ లుక్ & టైటిల్ గ్లింప్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial