World Cup 2023 Points Table: ఐసీసీ టోర్నమెంట్‌ల్లో న్యూజిలాండ్‌పై 20 సంవత్సరాల తర్వాత భారత జట్టు విజయం సాధించింది. ధర్మశాలలో జరిగిన ప్రపంచ కప్ 2023 21వ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. ఈ విజయంతో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానం సాధించింది. ఇది మ్యాచ్‌కు ముందు నంబర్ వన్ స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఓటమి తర్వాత న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. కాగా ప్రస్తుతం పాకిస్తాన్, ఇంగ్లండ్‌ల పరిస్థితి కాస్త డౌట్‌ఫుల్‌గా ఉంది.
టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా ఐదో విజయం. మ్యాచ్‌కు ముందు, న్యూజిలాండ్ కూడా 2023 ప్రపంచ కప్‌లో ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు, కానీ టీమ్ ఇండియా వారి విజయాల పరంపరను నాశనం చేసింది. ప్రస్తుతం పట్టికలో అత్యధికంగా 10 పాయింట్లు సాధించిన జట్టుగా భారత జట్టు నిలిచింది. న్యూజిలాండ్ 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
టాప్-4 జట్ల గురించి చెప్పాలంటే, భారత జట్టు మొదటి స్థానంలో, న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. టోర్నమెంట్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లు, +2.212 నెట్ రన్ రేట్‌ను సాధించిన దక్షిణాఫ్రికా టాప్-4 జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌లలో రెండు గెలిచి 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే కంగారూ జట్టు నెట్ రన్ రేట్ మాత్రం మైనస్‌లో ఉంది (-0.193).
మిగిలిన జట్లలో, పాకిస్తాన్ నాలుగు మ్యాచ్‌ల తర్వాత నాలుగు పాయింట్లు సాధించి, నెగెటివ్ -0.456 నెట్ రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉంది, బంగ్లాదేశ్ రెండు పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచ్‌ల తర్వాత బంగ్లాదేశ్ నెట్ రన్‌రేట్ (-0.784) నెగిటివ్‌లోనే ఉంది.
నెదర్లాండ్స్ ఏడో స్థానంలోనూ, శ్రీలంక ఎనిమిదో స్థానంలోనూ, ఇంగ్లండ్ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా రెండు పాయింట్లతోనే పదో స్థానంలో ఉంది. ఇప్పటికి భారత్, న్యూజిలాండ్ మాత్రమే తలో ఐదు మ్యాచ్‌లు ఆడాయి. మిగతా జట్లు అన్నీ నాలుగేసి మ్యాచ్‌ల్లో మాత్రమే పాల్గొన్నాయి.