Devil Movie 2023 : కథానాయకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయాణం చాలా వైవిధ్యమైనది. కేవలం కమర్షియల్ హంగులు ఉన్న కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా... ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన సినిమా చూపించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన ఎంపిక చేసుకునే పాత్రలు, కథలు ప్రేక్షకులు అందరినీ మెస్మరైజ్‌ చేస్తుంది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రయోగాలు చేస్తున్నారు. 'డెవిల్'తో మరోసారి కొత్త కథను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 


నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'డెవిల్' (Devil Movie). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. 'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ సరసన మరోసారి ఆమె నటించిన చిత్రమిది. నిర్మాత అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో రూపొందింది. 


కళ్యాణ్ రామ్ రాయల్ లుక్ 
విజయ దశమి సందర్భంగా నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త స్టిల్ విడుదల చేసింది 'డెవిల్' టీమ్! అందులో ఆయన లుక్ చాలా రాయల్ గా ఉందని అభిమానులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన కొత్తగా కనిపిస్తున్నారు.






దసరా సందర్భంగా అభిమానులను స్పెషల్‌ పోస్టర్‌తో విష్‌ చేశారు నందమూరి కళ్యాణ్ రామ్‌. పార్టీకి రెడీ అయినట్టు స్పెషల్‌ టుక్సెడోలో అదుర్స్ అనిపిస్తున్నారు. ''చెడుపై మంచి  సాధించిన విజయాన్ని పర్వదినంగా జరుపుకుందాం. అందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు. అందరి జీవితాల్లోనూ ఆనందాలు, శుభాలు వెల్లివిరియాలి'' అని శుభాకాంక్షలు తెలిపారాయన.


Also Read : నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్'లో రోజీగా బాలీవుడ్ భామ



   
నవంబర్ 24న 'డెవిల్' విడుదల 
Devil Movie 2023 Release Date : ఇటీవల విడుదలైన 'డెవిల్‌' టీజర్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ ఏడాది నవంబర్‌ 24న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మాళవిక నాయర్‌, ఎల్నాజ్‌ నరౌజి పోస్టర్లకు... ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. 


Also Read : వెనక్కి తగ్గేది లేదు - ప్రభాస్‌తో పోటీలో ఒక్క రోజు ముందుకు షారుఖ్


నందమూరి కళ్యాణ్ రామ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్. మణిమేఖల పాత్రలో రాజకీయ నాయకురాలిగా మాళవికా నాయర్ కనిపించనున్నారు. రోజీగా బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్‌ నరౌజి నటించారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ : గాంధీ నడికుడియార్‌, కూర్పు : తమ్మిరాజు, కథా విస్తరణ : ప్రశాంత్‌ బారది, కాస్ట్యూమ్‌ డిజైనర్ : విజయ్‌ రత్తినమ్‌ ఎంపీఎస్‌ఈ, కథ - కథనం - సంభాషణలు : శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం : సౌందర రాజన్‌, సంగీతం : హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, నిర్మాణ సంస్థ : అభిషేక్‌ పిక్చర్స్, సమర్పణ : దేవాంశ్‌ నామా, నిర్మాణం & దర్శకత్వం: అభిషేక్‌ నామా. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial