Elnaaz Norouzi In Kalyan Ram Devil Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా 'డెవిల్'. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. ఇందులో సంయుక్తా మీనన్ హీరోయిన్. 


'బింబిసార' తర్వాత కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ మరోసారి నటించిన సినిమా 'డెవిల్'. సంయుక్తా మీనన్ కాకుండా 'డెవిల్'లో మరో అందాల భామ మాళవికా నాయర్ కీలక పాత్రలో నటించారు. మణిమేఖల పాత్రలో ఆమె ఫస్ట్ లుక్ కూడా ఇటీవల విడుదల విడుదల చేశారు. ఆ లుక్ చూస్తే... ఆవిడ రాజకీయ నాయకురాలిగా నటించినట్లు అర్థం అవుతోంది. వీళ్ళిద్దరూ కాకుండా ఈ సినిమాలో మరొక అందాల భామ కూడా ఉన్నారు. 


రోజీ పాత్ర‌లో ఎల్నాజ్ నోరౌజీ
విదేశీ భామ, హిందీలో 'హలో చార్లీ' సినిమాతో పాటు 'దేర్ పటే వోన్ బాంబే', 'అభయ్' తదితర వెబ్ సిరీస్‌లలో నటించిన అందాల నటి ఎల్నాజ్ నోరౌజీ. 'డెవిల్'లో రోజీ పాత్రలో ఆమె నటించినట్లు తెలిపారు. అంతే కాదు... ఆవిడ ఫస్ట్ లుక్ సైతం విడుదల చేశారు. ఎల్నాజ్ నోరౌజీ లుక్ చూస్తే... క్లబ్ డ్యాన్సర్ రోల్ చేసినట్లు అర్థం అవుతోంది. 


Also Read 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?


'డెవిల్' సినిమాతో నిర్మాత, అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా దర్శకుడిగా మారారు. ఆయన ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ, 1940 నేపథ్యంలో 'డెవిల్' తెరకెక్కించారు. ఆల్రెడీ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 24న సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 



ప్రేక్షకుల్ని 1940 కాలంలోకి తీసుకు వెళ్లేందుకు సంగీతాన్ని కూడా చక్కగా ఉపయోగించుకోవాలని పాటల మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు దర్శక నిర్మాత అభిషేక్ నామా, సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్. వాళ్ళిద్దరి ఆలోచనల నుంచి పుట్టిందే 'మాయే చేసే' వింటేజ్ సాంగ్‌.


'మాయే చేసే...' పాటలో రకరకాల వాయిద్యాలు వాడారు. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు... మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్... చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా... దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ తదితర వాయిద్యాలను ఈ పాటలో వాడారు.


Also Read టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా? సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?


'డెవిల్' చిత్రానికి కాస్ట్యూమ్ డిజైన్స్‌:  అశ్విన్ రాజేష్, రీ రికార్డింగ్ మిక్స్‌:  ఎ.ఎం. ర‌హ్మ‌తుల్లా, ఎం. ర‌హ్మ‌తుల్లా, స్టంట్స్‌:  వెంక‌ట్ మాస్ట‌ర్‌, కూర్పు : త‌మ్మిరాజు, కథా విస్తరణ : ప్ర‌శాంత్ బ‌రాడి, ఛాయాగ్రహణం :  సౌంద‌ర్ రాజ‌న్‌ .ఎస్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  గాంధీ న‌డికుడిక‌ర్‌, క‌థ‌ - కథనం - మాట‌లు : శ్రీకాంత్ విస్సా, సంగీతం :  హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌, సమ‌ర్ప‌ణ‌:  దేవాన్ష్ నామా, నిర్మాణ సంస్థ : అభిషేక్ పిక్చ‌ర్స్‌, నిర్మాణం - దర్శకత్వం : అభిషేక్ నామా. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial