Dunki to release on Dec 21st : రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మధ్య పోటీ తప్పేలా లేదు. క్రిస్మస్ పండక్కి కొన్ని రోజుల ముందు వాళ్ళిద్దరూ బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతున్నారు. మరోసారి షారుఖ్ సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. 


డిసెంబర్ 21న 'డంకీ' విడుదల...
ఒక్క రోజు ముందుకు షారుఖ్ ఖాన్!
షారుఖ్ ఖాన్ 'డంకీ' సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. అయితే... అనూహ్యంగా ఆ తేదీకి, క్రిస్మస్ సీజన్ బరిలోకి ప్రభాస్ 'సలార్' సినిమా వచ్చింది. దాంతో తెలుగు సినిమాలు నాని 'హాయ్ నాన్న', నితిన్ 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ 7, 8 తేదీలకు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ 'సైంధవ్' అయితే సంక్రాంతి పండక్కి... జనవరి 13వ తేదీకి వెళ్ళింది. 


షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) 'డంకీ' సైతం వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. ప్రభాస్ 'సలార్'తో పోటీకి వెనకడుగు వేసిందని గుసగుసలు చాలా వినిపించాయి. అయితే... అటువంటిది ఏమీ లేదని గతంలో కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు మరోసారి విడుదల తేదీ వెల్లడించారు. చిన్న ఛేంజ్ ఏమిటంటే... ఒక్క రోజు సినిమా ముందుకు వెళ్ళింది. డిసెంబర్ 22న కాకుండా 21న థియేటర్లలోకి వస్తున్నారు షారుఖ్. అదీ సంగతి!


Also Read 'లియో' రివ్యూ : LCUలో విజయ్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ మేజిక్ వర్కవుట్ అవుతుందా? లేదా?


'పఠాన్', 'జవాన్'... ఈ ఏడాది షారుఖ్ ఖాన్ రెండు భారీ విజయాలు నమోదు చేశారు. బాక్సాఫీస్ బరిలో ఆయన సినిమాలు కొత్త సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. మరి, ఇయర్ ఎండింగ్‌లో మరో హిట్టు కొట్టి హ్యాట్రిక్ నమోదు చేస్తారో? లేదో? వెయిట్ అండ్ సి!


షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు... ఆయన విజయాల జోరుకు తోడు 'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'లగే రహో మున్నాభాయ్', '3 ఇడియట్స్', 'సంజు' చిత్రాల దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఉండటంతో 'డంకీ' మీద ఉత్తరాది ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్ కుమార్ హిరాణీకి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. 


Also Read టైగర్ నాగేశ్వరరావు రివ్యూ : రవితేజ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడా? లేదా? సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి?


షారుఖ్ జోరు మీద ఉంటే... మరోవైపు ప్రభాస్ లాస్ట్ రెండు సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు. భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ... సినిమాల్లో విషయం లేకపోవడంతో వీకెండ్ తర్వాత చతికిలపడ్డాయి. అయితే... 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉండటం, 'రాధే శ్యామ్' & 'ఆదిపురుష్' తరహాలో కాకుండా 'సలార్' అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా కావడంతో ఈసారి తప్పకుండా భారీ సక్సెస్ కొట్టడం ఖాయమని పరిశ్రమ వర్గాలు కూడా భావిస్తున్నాయి. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial