News
News
X

Lalit vijay : ముసలోళ్లే కానీ మహానుభావులు - మోదీ, మాల్యాలపై నెటిజన్ల సెటైర్లు !

విజయ్ మాల్యా, లలిత్ మోదీల పెళ్లిళ్లపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు.

FOLLOW US: 

Lalit vijay  :    సొమ్ము ఒకడిది..సోకు ఇంకొకడిది అంటారు. ఈ మాట లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యాల విషయంలో కరెక్ట్‌ గా సరిపోతుంది.  వేల కోట్ల రూపాయలను ఎగొట్టి విదేశాల్లో ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారో చెబుతూ విడుదల చేస్తోన్న ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. పనిలో పనిగా  కేంద్రంపైనా విమర్శలు చేస్తున్నారు. టి 20 లీగ్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోదీపై మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత వంటి పలు కేసులున్నాయి. 2010 లో భారత్‌ నుంచి పరారైన మోదీని ఇండియాకు తెచ్చేందుకు  చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లండన్‌ లో ఉన్నట్లు మీడియా బయటపెట్టినా కూడా కేంద్రం చేతులెత్తేసింది. ఫలితంగా కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న మోదీ ఇప్పుడు మరోసారి తన డేటింగ్‌ వ్యవహారంతో హాట్‌ టాపిక్‌ అయ్యాడు.

మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ తో కలిసి లలిత్ మోదీ దిగిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. లేటు వయసులో డేటింగ్‌ లో మునిగితేలుతున్న ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభించామని చెబుతూ విడుదల చేసిన ఫోటోలపై నెటిజన్లు తమ స్టైల్లో కామెంట్స్‌ చేస్తున్నారు. తన కంటే చాలా చిన్న  కుర్రాడితో నిన్నటివరకు లివింగ్‌ రిలేషన్‌ కొనసాగించిన ఈ మాజీ సుందరి ఇప్పుడు లలిత్‌ మోదీతో జోడీ కట్టడంపై ఫ్యాన్సే కాదు కుటుంబసభ్యులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సుస్మితాసేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌ ఈ ఫోటోలను చూసి షాకయ్యానంటున్నాడు. తన సోదరితో మాట్లాడితే కానీ అసలు విషయం తెలియదంటున్నాడు.

నాట్‌ ఓన్లీ లలిత్‌ మోదీ… విలాసపురుషుడు విజయ్‌ మాల్యా కూడా ఇలానే లండన్‌ లో మకాం వేశాడు. వేల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టి  భారత్‌ నుంచి పారిపోయాడు. ఎప్పుడూ మీడియాలో హైలెట్‌ అవ్వడమే తన పని. ఓ వైపు భారత్‌ లోనే కాదు అటు బ్రిటన్‌ కోర్టులోనూ మాల్యాపై పలు కేసులున్నాయి. ఇది చాలవన్నట్లు కూతురు వయసున్న అమ్మాయిని పెళ్లాడి మరోసారి వార్తల్లో నిలిచాడు. 

ఇక మన పొలిటికల్ లీడర్లు మాత్రం ఏం తక్కువ తిన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ కూడా ఓ జర్నలిస్ట్ తో రహస్యంగా వ్యవహారాన్ నినడిపించారు. చివరకు దొరికే సరికి తప్పేంటి అంటూ రిలేషన్‌ గురించి బయటపెట్టారు. ఇక అప్పటి నుంచి అంతా ఓపేనే.  మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ కూడా ఇలానే లేటు వయసులో సునందా పుష్కర్‌ ప్రేమలో పడి విషయం బయటకు పొక్కే సరికి పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులకే సునందా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పట్లో ఇదే పెద్ద దుమారమే.

వయసు శరీరానికి కానీ మనసు కాదంటూ లేటు వయసులో ఘాటు ప్రేమని చూపిస్తూ ఈతరం వాళ్లతో పోటీపడీ మరీ సోషల్‌ మీడియాలోనూ హంగామా చేస్తోన్నారు. ఎవరి పర్సనల్‌ లైఫ్‌ వాళ్లది కాదనలేము కానీ శ్రీరంగనీతులు మాత్రం చెప్పవగ్గంటున్నారు పబ్లిక్‌.

Published at : 15 Jul 2022 07:34 PM (IST) Tags: Vijay Mallya Sushmita Sen Lalit Modi Sushmita Sen's wedding with Lalit Modi

సంబంధిత కథనాలు

Bihar BJP JDU Alliance End: రాజీనామాకు నితీశ్ కుమార్ రెడీ- BJPకి హ్యాండ్ ఇచ్చిన జేడీయూ!

Bihar BJP JDU Alliance End: రాజీనామాకు నితీశ్ కుమార్ రెడీ- BJPకి హ్యాండ్ ఇచ్చిన జేడీయూ!

Breaking News Live Telugu Updates: విజయనగరం జిల్లాలో మద్యం వ్యాను బోల్తా, పోటెత్తిన మందుబాబులు

Breaking News Live Telugu Updates: విజయనగరం జిల్లాలో మద్యం వ్యాను బోల్తా, పోటెత్తిన మందుబాబులు

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

Maharashtra Cabinet Expansion: ఎట్టకేలకు 'మహా' కేబినెట్ విస్తరణ- 18 మందికి చోటు, మహిళలకు నో ఛాన్స్!

APSRTC Bus Theft: ఆర్టీసీ బస్సునే కొట్టేసిన దుండగుడు, కంగారుపడ్డ డ్రైవర్ - ఇంతలో ఊహించని ట్విస్ట్!

APSRTC Bus Theft: ఆర్టీసీ బస్సునే కొట్టేసిన దుండగుడు, కంగారుపడ్డ డ్రైవర్ - ఇంతలో ఊహించని ట్విస్ట్!

Bihar Political Crisis: బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నితీశ్!

Bihar Political Crisis: బిహార్ రాజకీయంలో మరో ట్విస్ట్- గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన నితీశ్!

టాప్ స్టోరీస్

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Happy Rakhi Pournami 2022: రక్షా బంధన్ శుభముహూర్తం ఎప్పుడు, రాఖీ ఏ టైమ్ లో కట్టాలి!

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్

Actress Pragathi : ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలి - ప్రగతిపై పంచ్