అద్దాల అంగడి మాయ.. ఇది తెలంగాణ జానపద కవి గోరేటి వెంకన్న రాసిన పాట. ఈ పాటలో ఎంత అర్థం ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే అదే అద్దాలను పగులగొడితే 17 మంది అమ్మాయిలు బయటకు వచ్చారు. ఇదేంటి అనుకుంటున్నారా? అవును అదే మరి అద్దాల మాయ. అసలేం జరిగిందంటే?
అసలేం జరిగిందంటే..
అది మహారాష్ట్ర అంధేరీలోని దీప బార్. నిబంధనలకు వ్యతిరేకంగా బార్‌లో యువతులతో నృత్యాలు చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే సోషల్ సర్వీస్ విభాగ పోలీసులు రాత్రి 11.30 తర్వాత తనిఖీలు చేశారు. పోలీసుల రాకను గమనించిన డాన్సర్లు, బార్ సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారు.
ఎంత వెతికినా ఎక్కడా అలాంటి దాఖలాలే లేవు. అయితే ఎందుకో అనుమానం వచ్చి ప్రతి మూలలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టోరేజీ గదులు, వంటశాలలు సహా గదులన్నింటినీ తనిఖీ చేశారు. కానీ ఏమీ లాభం లేదు. చివరకు బార్ మేనేజర్, క్యాషియర్, వెయిటర్లను గంటల పాటు విచారించారు.
అద్దాల మాయ..
ఈ క్రమంలో ఓ అద్దం వారికి అనుమానాస్పదంగా కనిపించింది. దాన్ని పగులగొట్టిన పోలీసులకు వెనక ఉన్న రహస్య గది కనిపించింది. మొత్తం 17 మంది డ్యాన్సర్లు అందులో దాక్కున్నారు. ఈ రహస్య గదిలో ఏసీలు, శీతల పానీయాలు, ఆహార ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది చూసి పోలీసులు కంగుతిన్నారు. బార్ మేనేజర్, క్యాషియర్‌తో పాటు 17 మంది డ్యాన్సర్లపై కేసు నమోదు చేశారు. అందుకే అద్దాల అంగడి మాయ అన్నమాట.
Also Read: PM Modi in Varanasi: వారణాసి పర్యటనలో మోదీ.. కాల భైరవుడికి ప్రత్యేక పూజలు
Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్
Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు
Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం
Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి