పొగతాగేవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే. అలాగని తాగని వారిలో రాదని కచ్చితంగా చెప్పలేం. ధూమపానం అలవాటు లేని వారిలో వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్‌కూ, పొగతాగే అలవాటు ఉన్న వారిలో వచ్చే క్యాన్సర్‌కూ మధ్య చాలా తేడా ఉన్నట్టు కనిపెట్టారు వైద్యులు. ఆ రెండు వర్గాల వారిలో క్యాన్సర్ స్వభావం, పనితీరు, చూపించే ప్రభావం కూడా భిన్నంగా ఉన్నట్టు చెబుతున్నారు.
అసలు విషయం ఏంటంటే....
పొగ తాగని వారిలో అనుకోని పరిస్థితుల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చినప్పుడు వారిలో ఆ మహమ్మారి రోగం నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు వాషింగ్టన్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం తేలింది. వీరితో పోల్చుకుంటే ధూమపానం చేసేవారిలో లంగ్ క్యాన్సర్ నయమయ్యే అవకాశాలు చాలా తక్కువ. క్యాన్సర్ వచ్చాక ధూమపానం మానేసినా కూడా, ముందు తాగిన పొగ తాలూకు ప్రభావం ఊపిరితిత్తులపై ఉంటుంది. పొగ అలవాటు లేని వారి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితుల్లో కొన్ని ప్రత్యేకమైన జన్యు మార్పులు కలిగి, మందుల వల్ల 78 శాతం నుంచి 92 శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ధూమపానం అలవాటును మానుకోమని హితవు పలుకుతున్నారు.
పొగ తాగడమే కారణం
అధ్యయనాల ప్రకారం 90 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు పొగ తాగడమే ప్రధాన కారణం. అలాగే పొగాకు నమలడం వల్ల నోటి క్యాన్సర్లు వస్తున్నాయి. మిగతా వారితో పోల్చితే పొగ తాగే వారిలో, పొగాకు నమిలే వారిలో రెండు మూడు రెట్లు గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. ఇవే కాదు ఎన్నో రకాల వ్యాధులు ధూమపానం కారణంగా దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Read Also: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి
Read Also: తిండి విషయంలో ఈ చెడు అలవాట్లు మీకున్నాయా? వెంటనే వదిలేయండి
Read Also: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Read Also: థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!
Read Also: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు