ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్ వారణాసి చేరుకున్నారు. మోదీకి తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఘనస్వాగతం లభించింది. ప్రజలకు అభివాదం చేశారు మోదీ.












కాశీ విశ్వనాథుడి ఆలయ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూ నిర్మించిన నడవాను మోదీ నేడు దేశ ప్రజలకు అంకితం చేయనున్నారు. 


ప్రత్యేక పూజలు..







వారణాసిలోని కాలభైరవ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేశారు. కాలభైరవుడికి హారతి ఇచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కాశీ విశ్వనాథ్​ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు మోదీ. మధ్యాహ్నం 1.20 గంటలకు కాశీ విశ్వనాథ్​ నడవాను ప్రారంభిస్తారు. 


పర్యటన విశేషాలు..


ఈ ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం రూ. 339 కోట్లు వెచ్చించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో వివిధ మఠాలకు చెందిన 3 వేలమందికిపైగా సాధువులు, మత పెద్దలు, కళాకారులు, పురప్రముఖులతో పాటు భాజపా పాలిత 12 రాష్ట్రాల సీఎంలూ పాల్గొననున్నారు. నడవాను ప్రారంభించిన తర్వాత గంగానదిలో విహార నౌకపై సీఎంలతో సమావేశం కానున్నారు ప్రధాని.


గంగా హారతిని కూడా నౌక నుంచే వీక్షించనున్నారు. వారణాసి ఎంపీగా ఈ మెగా కారిడార్​ పనులకు 2019 మార్చి 8న మోదీ శంకుస్థాపన చేశారు.


Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 7,350 మందికి వైరస్


Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు


Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం


Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే


Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి


Also Read: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి