దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 7,350 కరోనా కేసులు నమోదుకాగా 202 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 561 రోజుల కనిష్ఠానికి చేరాయి. ప్రస్తుతం 91,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.








  • మొత్తం మరణాలు: 4,75,636

  • యాక్టివ్ కేసులు: 91,456

  • కోలుకున్నవారు: 3,41,30,768


కొత్తగా 7,973 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.26గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.37గా ఉంది. మరణాల రేటు 1.37 శాతంగా ఉంది.







వ్యాక్సినేషన్..


దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఆదివారం 19,10,917 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్​ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,33,17,84,462కు చేరింది.


ఒమిక్రాన్ కేసులు..


ఒమిక్రాన్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య 38కి చేరింది. ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగితే దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు 63 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. 


Also Read: కరోనా సోకితే ఈ ఆహారపదార్థాలు దూరం పెట్టాలి... తిన్నారో అంతే సంగతులు


Also Read: పొగతాగని వారిలో ఆ క్యాన్సర్ త్వరగా నయమయ్యే అవకాశం


Also Read: విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే


Also Read: పొట్ట నిండా లాగించాక అసౌకర్యంగా ఉందా... ఇలా చేయండి


Also Read: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి