కరోనా కేసులు తగ్గిపోయాయంటూ కొన్ని నెలలు హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. ఈలోపే మరో వేరియంట్ దాడి చేసింది. అదెప్పుడు రెచ్చిపోయి అందరికీ సోకుతుందో అన్న భయం మళ్లీ మొదలైంది. ఈలోపే మామూలు కరోనా కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే దాదాపు వ్యాక్సినేషన్ జరిగింది కాబట్టి ప్రాణాంతకంగా మారడం లేదు. కరోనా సోకిన వ్యక్తులు ఆహారం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.


వేపుళ్లు
నూనెలో వేయించిన వేపుళ్లను దూరం పెట్టాలి. రుచికి ఇవి బావున్నా వీటిలో కొవ్వు అధికంగా ఉంటుంది. అందేకాదు కోవిడ్ రోగుల్లో ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. అంతేకాదు పేగుల్లో ఉండే మంచి బ్యాక్టిరియా వేపుళ్ల వల్ల ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటే వేపుళ్ల ఆహారానికి దూరంగా ఉండాలి. 


కూల్ డ్రింకులు
కరోనా సోకిన వారిలో రుచి గ్రంథులు సరిగా పనిచేయవు. అందుకే వారికి ఏ రుచి సరిగా తెలియదు. రుచి కోసం కూల్ డ్రింకులు తాగడం వంటివి చేస్తారు. ఈ తీపి పానీయాలు శరీరంలో వాపును పెంచుతాయి. కరోనా వేళ వీటిని తీసుకోవడం మంచిది కాదు. మజ్జిగ, నిమ్మరసం లాంటివి తాగడం మంచిది. 


మసాలా వంటకాలు
కరోనా సోకిన వారిలో గొంతు మంట, నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. వారికి మసాలా వంటకాలు అస్సలు పడవు. ముఖ్యంగా గొంతును చాలా ఇబ్బంది పడతాయి. కాబట్టి మసాలా, కారం ఎక్కువగా వేసిన వంటకాలకి దూరంగా ఉండడం ఉత్తమం. దానికి మిరియాల పొడి వేసుకుని తినడం మంచిది. మిరియాలు వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు సాయం చేస్తాయి. 


రెడీ టు ఈట్ ఫుడ్
వండుకునే ఓపిక లేక చాలా మంది మార్కెట్లో దొరికే రెడీ ఈట్ ఫుడ్, రెడీ టు కుక్... వంటి ప్యాకేజ్డ్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. కానీ కరోనా సోకిన వాళ్లు మాత్రం ఈ ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిని నిల్వ చేసేందుకు సోడియాన్ని వినియోగిస్తారు. అలగే కొన్ని రసాయనాలను వాడతారు. ఇవి రోగనిరోధశక్తిని తగ్గిస్తాయి.  


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.



Read Also: తిండి విషయంలో ఈ చెడు అలవాట్లు మీకున్నాయా? వెంటనే వదిలేయండి
Read Also:  విటమిన్ డి లోపంతో గుండె జబ్బులు... చెబుతున్న కొత్త పరిశోధన, తినాల్సినవి ఇవే
Read Also: థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌ రూపంలోనే రాబోతోందా? ఈ వేరియంట్‌ను తట్టుకోవాలంటే బూస్టర్ డోస్ అవసరమా.. అధ్యయనంలో ఏముంది!
Read Also: మీ హక్కులు మీకు తెలుసా? మీ స్వేచ్ఛని లాక్కునే హక్కు ఈ భూమ్మీద ఎవరికీ లేదు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి