Congress News: వివాదాస్పదంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రవర్తన, మహిళతో అలా చేయొచ్చా? - వైరల్ వీడియో
Kavvampally Satyanarayana: మరో వేడుకలోనూ ఎమ్మెల్యే ఆమె చేయి పట్టి లాగీ బలవంతంగా డాన్స్ చేయించారు. ఈ వీడియోలపై స్థానిక బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
Manakonduru MLA Kavvampally Satyanarayana: ఇటీవల జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటీవల న్యూ ఇయర్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే.. ఓ మహిళా కాంగ్రెస్ కార్యకర్తతో అతిగా ప్రవర్తించారు. మరో వేడుకలోనూ ఎమ్మెల్యే ఆమె చేయి పట్టి లాగీ బలవంతంగా డాన్స్ చేయించారు. ఈ వీడియోలపై స్థానిక బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ప్రజా ప్రతినిధి ప్రవర్తించే ఇలాగేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇదే విషయంపై యువజన కాంగ్రెస్ నాయకుడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ న్యూ ఇయర్ వేడుకల్లో మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారని వస్తున్న వార్తలను ఖండించారు. సదరు మహిళలను ఎమ్మెల్యే తన సోదరిగా భావిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు గతంలో ఆమె ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన చిత్రాలను విడుదల చేశారు.
Viral Video :
— Actual India (@ActualIndia) January 2, 2024
Telangana, Manakondur Congress MLA Kavvampally Satyanarayana's deplorable behaviour with a woman at an event. The woman clearly feels uneasy. pic.twitter.com/UjuiH5oUtO
Manakondur #Congress MLA #KavvampallySatyanarayana has been accused of misbehaving with a woman amid #NewYear celebrations alongside #Telangana BC welfare minister #PonnamPrabhakar.
— Hate Detector 🔍 (@HateDetectors) January 2, 2024
In videos that surfaced on social media, the MLA is seen attempting to smear a woman’s face with… pic.twitter.com/r5Z56yed8s
కవ్వంపల్లి సత్యనారాయణ 2023లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో కవ్వంపల్లి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కేవలం 13,267 ఓట్లు మాత్రమే సాధించగలిగి మూడో స్థానంలో నిలిచారు. అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్, కాంగ్రెస్ నుంచి ఆరేపల్లి మోహన్ ప్రత్యర్థులుగా ఉన్నారు. తర్వాత 2018 ఎన్నికల్లో పోటీ చేయలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌ను, బీజేపీ నుంచి పోటీ చేసి ఆరేపల్లి మోహన్ ను ఓడించగలిగారు. సమీప ప్రత్యర్థి అయిన రసమయిని దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.