అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Maharashtra MVA crisis: నాకు బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చారు, మిస్సింగ్ శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మిస్సింగ్ శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్ మహారాష్ట్రకు తిరిగి వచ్చారు. ఏక్‌నాథ్‌ షిండే మనుషులు తనను బలవంతంగా తీసుకెళ్లారంటూ ఆరోపించారు.

సోమవారం మిస్సింగ్..ఉన్నట్టుండి ప్రత్యక్షం..

మహారాష్ట్ర రాజకీయాల్లో సినిమాను తలపించే నాటకీయత కనిపిస్తోంది. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి గండం వచ్చి పడింది. పలువురు ఎమ్మెల్యేలఫిరాయింపులతో మెజార్టీ తగ్గింది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. ఈ పరిణామాల మధ్యే ఓ శివసేన ఎమ్మెల్యే కనిపించకుండా పోవటం ఆందోళనలకు తెర తీసింది. సోమవారం నుంచి బాలాపూర్ ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్‌ అదృశ్యమయ్యారు. ఈ మిస్సింగ్‌పై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన మహారాష్ట్రకు తిరిగొచ్చారు. ఏక్‌నాథ్ షిండేని నమ్మి ఆయనతో పాటు గుజరాత్‌ వెళ్లానని, అక్కడి పోలీసులు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు నితిన్ దేశ్‌ముఖ్. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే మిస్ అయ్యి మళ్లీ మహారాష్ట్రకు చేరుకోగా తరవాత నితిన్ దేశ్‌ముఖ్‌ కూడా సొంత రాష్ట్రానికి వచ్చేశారు. ప్రస్తుతానికి ఉద్ధవ్‌ థాక్రే ప్రభుత్వానికి పెద్ద కష్టమే వచ్చింది. ఏక్‌నాథ్‌ షిండే పార్టీపై తిరుగుబావుటా ఎగరేసి బయటకొచ్చారు. ఆయనతో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలనూ తనవైపు తిప్పుకున్నారు.

థాక్రే సైనికుడిని..ఎప్పటికీ ఆయనతోనే

నితిన్‌ దేశ్‌ముఖ్‌ కన్నా ముందు మరో ఎమ్మెల్యే కైలాష్ పాటిల్ ఏక్‌నాథ్‌ షిండేపై ఆరోపణలు చేశారు. ఆయన మనుషులు బలవంతంగా గుజరాత్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, కానీ తప్పించుకుని వచ్చానని చెప్పారు. ఇటు నితిన్ దేశ్‌ముఖ్ తన స్వామి భక్తిని చాటుకున్నారు. "తాను ఛత్రపతి శివాజీ సైనికుడినని గుర్తు చేసిన నితిన్..గుజరాత్‌ పోలీసులు బలవంతంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారని ఆరోపించారు. "నాకు హార్ట్‌ ఎటాక్ వచ్చిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అదంతా అబద్ధం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నా బ్లడ్‌ ప్రెజర్‌ పెరిగిందన్న మాటలో వాస్తవం లేదు" అని స్పష్టం చేశారు. గుజరాత్ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పుకార్లు పుట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆసుపత్రిలో ఓ పాతిక మంది చుట్టుముట్టి తనకు బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ ఇంజెక్షన్‌ ఎందుకు ఇచ్చారో, అందులో ఏముందో తనకు తెలియదని చెప్పారు. నాకు అనారోగ్యం కలిగించాలనే ఉద్దేశంతోనే అలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను థాక్రే సైనికుడినని, ఆయనతో ఇప్పటికే మాట్లాడానని, ప్రస్తుతానికి స్వగృహానికి వెళ్తున్నానని వెల్లడించారు నితిన్ దేశ్‌ముఖ్. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget