Land-For-Jobs Case: అరెస్ట్ చేయమని హామీ ఇచ్చిన సీబీఐ, విచారణకు హాజరవుతానన్న తేజస్వీ
Land-For-Jobs Case: మార్చి 25 న సీబీఐ ఎదుట హాజరవుతానని తేజస్వీ యాదవ్ వెల్లడించారు.
Land-For-Jobs Case:
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్..
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు విచారణకు హాజరవుతానని బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ ఢిల్లీ హైకోర్టులో వెల్లడించారు. మార్చి 25న కోర్టులో హాజరవుతానని తెలిపారు. ఇప్పటికే సీబీఐ మూడు సార్లు ఆయనకు నోటీసులు పంపింది. కానీ ప్రతిసారి ఏదో ఓ కారణం చెబుతూ హాజరు కాలేదు. ఈ సారి మాత్రం తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. సీబీఐ నోటీసులు పంపినా స్పందించకపోవడంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు...ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించింది. తేజస్వీ తరపున వాదించిన న్యాయవాది తన వాదనలు వినిపించారు. సీబీఐ ఎదుట హాజరైతే ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారని అన్నారు. బడ్జెట్ సమావేశాల కారణంగా ఏప్రిల్ 5వ తేదీ తరవాతే సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్తారని వివరించారు. ఈ వాదనలు విన్న సీబీఐ తేజస్వీని అరెస్ట్ చేసే ఆలోచనే లేదని తేల్చి చెప్పింది.
"ఆయన కోర్టులో హాజరు కావడమే మాకు కావాల్సింది. కొన్ని కీలక డాక్యుమెంట్స్‌నీ ఆయన సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇదంతా కుదరదు"
-CBI
Land-for-jobs scam: Tejashwi Yadav agrees in HC he will appear before CBI for questioning at its Delhi headquarters on March 25
— Press Trust of India (@PTI_News) March 16, 2023