Top 10 Headlines Today:


 


పుంగనూరు అల్లర్ల కేసులో మలుపు


పుంగనూరు అల్లర్ల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఏ1 గా టీడీపీ అధినేత చంద్రబాబును చేరుస్తూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆయనతోపాతు ఏ2గా దేవినేని ఉమామహేశ్వరరావు, ఏ3గా అమర్‌నాథ్ రెడ్డిని చేర్చారు. అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్‍లో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఊహించని దాడి 


 మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సూటిగా , సుత్త్తి లేకుండా చేసిన విమర్శలు ఏపీ అధికారపక్షాన్ని ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేశాయి. ఎందుకంటే ఇంత కాలం పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇవ్వడానికి వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎక్కువగా చిరంజీవి పేరును కూడా ఉపయోగించుకునేవారు. పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లు పవన్ వల్ల చిరంజీవి చాలా మందికి సారీ చెబుతున్నారని కూడా ప్రకటించేశారు. పేర్ని నాని.. జగన్ కు.. చిరంజీవికి మధ్య ఎంతో అనుబంధం ఉందని.. ప్రకటించేవారు. ఓ రకంగా ప్రభుత్వానికి .. వైసీపీకి చిరంజీవి మద్దతు దారు అన్న అభిప్రాయాన్ని బలవంతంగా కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడా బుడగ పేలిపోయింది. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చురుకుపుట్టించేవిగా ఉండటంతో ఇప్పటి వరకూ తాము చిరంజీవి ఫ్యాన్స్ అన్న వారంతా ఆయనపై విరుచుకుపడటం ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పెద్ద స్కెచ్ వేస్తున్న కేసీఆర్


ఢిల్లీలో వచ్చేది మన ప్రభుత్వమే.. దేశమంతా రైతు  బంధు అమలు చేస్తాం అని  కేసీఆర్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అసలు కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని సుదీర్ఘ కాలంగా పరిపాలించి నాశనం పట్టించాయని.. భారత రాష్ట్ర సమితి దేశాన్ని అమెరికా కన్నా ఎక్కువ అభివృద్ది చేస్తుందని చెబుతూ వస్తున్నారు. అందుకే  టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మర్చారు. కానీ కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పార్టీ విస్తరణకే సమయం కేటాయిస్తున్నారు. కనీసం మరో పొరుగు రాష్ట్రం ఏపీ వైపు కూడా చూడటం లేదు. మరి ఢిల్లీ పీఠం ఎలా దక్కించుకుంటారన్నదానిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆయన పార్టీని ట్రోల్ చేస్తన్న వారు కూడా ఉన్నారు.కానీ కేసీఆర్ రాజకీయ వ్యూహాలను అంచనా వేయడం కష్టం. ఆయన ప్లాన్  చూస్తే అదే నిపించక మానదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నేడు కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు


ఏపీ ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల పెళ్లికి అందించనున్న ఆర్థిక సాయం నిధులను బుధవారం విడుదల చేయనుంది.  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధుల్ని విడుదల చేయనున్నారు. నేడు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు. ఏప్రిల్- జూన్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని వధువు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అందుకు అధికారులు అన్ని  ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హార్ధిక పాండ్యాపై ఫైర్‌


భారత్ - వెస్టిండీస్ మధ్య  గయానా వేదికగా నిన్న రాత్రి ముగిసిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది.  విండీస్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు.. 17.5 ఓవర్లలోనే  దంచేసింది.   సూర్యకుమార్ యాదవ్ (83) తో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (49 నాటౌట్)లు  సూపర్ ఇన్నింగ్స్‌తో  భారత్‌కు విజయం దక్కింది. అయితే నిన్నటి మ్యాచ్‌లో అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న తిలక్ వర్మకు నిరాశకు గురి చేస్తూ హార్ధిక్ పాండ్యా  ఆఖర్లో సిక్సర్ కొట్టి అతడి ఆశలపై నీళ్లు చల్లాడు.   హార్ధిక్ మ్యాచ్‌ను గెలిపించినా నెటిజన్లు మాత్రం అతడిపై ఫైర్ అవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పోటీలో ఉన్న టీమిండియా


వెస్టిండీస్‌తో జరుగుతున్న  టీ20 సిరీస్‌లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది.  టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్  వీరోచిత ఇన్నింగ్స్ (44 బంతుల్లో 83, 10 ఫోర్లు, 4 సిక్సర్లు)‌కు తోడు  ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ (37 బంతుల్లో 49 నాటౌట్, 4 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి నిలకడైన ఆటతో  భారత్ మూడో టీ20లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన  160 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 17.5 ఓవర్లలోనే 3 వికెట్లు  మాత్రమే కోల్పోయి అలవోకగా  ఛేదించింది. ఈ విజయంతో సిరీస్‌లో విండీస్ ఆధిక్యాన్ని భారత్.. 1-2కు తగ్గించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జోడో యాత్ర 2.0


కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి దశకు విశేష స్పందన లభించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రెండోదశ యాత్ర చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలోనే భారత్ జోడో యాత్ర రెండో దశకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రెండో దశను ప్లాన్ చేసినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే మంగళవారం తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాష్ట్రలో పాదయాత్ర చేస్తారని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


'గుంటూరు కారం' స్టిల్స్


సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని (Mahesh Babu) హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ రోజు మహేష్ బాబు పుట్టిన రోజు (mahesh Babu Birthday) సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జైలర్ ప్రభంజనం 


సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన 'జైలర్' మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మరికొన్ని గంటల్లో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్ళు చెదిరే స్థాయిలో జరిగింది. మరీ ముఖ్యంగా తమిళనాడు, ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. దాంతో ఓపెనింగ్స్ ఎంత ఉండొచ్చు? ఫస్ట్ డే సినిమా కలెక్ట్ చేయవచ్చు? అని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు మొదలు అయ్యాయి.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సరికొత్త వ్యాపారాలు


మారుతున్న కాలానికి/టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచంలోకి కొత్త ఉత్పత్తులు/సర్వీసులు అడుగు పెడుతున్నాయి. 1947 సమయంలో భారత ప్రజలు సెల్‌ఫోన్‌ను ఊహించలేదు. 1990ల్లో ఉన్న వాళ్లు ఇంటింటికీ ఫుడ్‌ డెలివెరీ సర్వీసును ఊహించలేదు. 2000 ప్రారంభంలో ఉన్నప్పుడు వర్చువల్‌ రియాలిటీ/ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి టెక్నాలజీలను ఊహించలేదు. కానీ ఇప్పుడవన్నీ మన ముందున్నాయి. ఎవరైతే భవిష్యత్‌ను సరిగ్గా అంచనా వేసి బిజినెస్‌ చేస్తారో, వాళ్లు సక్సెస్‌ అవుతున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి