దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023-24వ సంవత్సరానికి సంబంధించిన నీట్ పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో భాగంగా మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్టు 8న మొదటి రౌండ్, తుది సీట్లను కేటాయించింది. సీట్ల కేటాయింపు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులు ఫలితాలను చూసుకోవచ్చు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 14లోపు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 


ఆల్‌ఇండియా కోటా కింద మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లతో పాటు డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎండీ, ఎంఎస్, డిప్లొమా, పీజీ డీఎన్‌బీ, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 4 రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలివిడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది.


నీట్ పీజీ సీట్ల కేటాయింపు వివరాల కోసం క్లిక్ చేయండి..


➥ రెండో రౌండ్‌కు సంబంధించి ఆగస్టు 17 నుంచి 21 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 18 నుంచి 22 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 23, 24 తేదీల్లో సీట్ల కేటాపుంపు ప్రాసెస్ కొనసాగనుంది. అనంతరం ఆగస్టు 25న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 26న సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 4 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


➥ మూడో రౌండ్‌కు సంబంధించి సెప్టెంబరు 7 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. సెప్టెంబరు 8 నుంచి 12 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. సెప్టెంబరు 14, 15 తేదీల్లో సీట్ల కేటాపుంపు ప్రాసెస్ కొనసాగనుంది. అనంతరం సెప్టెంబరు 16న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబరు 17న సంబంధిత డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు 18 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


మిగిలిన సీట్ల భర్తీకి 'స్ట్రే' వేకెన్సీ రౌండ్..
మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లను 'స్ట్రే' వేకెన్సీ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ రౌండ్‌కు సంబంధించి సెప్టెంబరు 28 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. అక్టోబరు 2, 3 తేదీల్లో సీట్ల కేటాపుంపు ప్రాసెస్ కొనసాగనుంది. అనంతరం అక్టోబరు 4న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 5న సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.


ALSO READ:


GATE 2024: 'గేట్‌-2024' షెడ్యూలు వచ్చేసింది, ఆగస్టు 24 నుంచి దరఖాస్తుల స్వీకరణ
దేశంలోని ఐఐటీలతోపాటు ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE-2024) దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి గేట్ నిర్వహణ బాధ్యతను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్‌సీ) చేపట్టింది. 'గేట్‌'లో ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో గేట్ పరీక్షలో మొత్తం పేపర్ల సంఖ్య 30కి చేరినట్లయింది. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..