New Business Opportunities: మారుతున్న కాలానికి/టెక్నాలజీకి అనుగుణంగా ప్రపంచంలోకి కొత్త ఉత్పత్తులు/సర్వీసులు అడుగు పెడుతున్నాయి. 1947 సమయంలో భారత ప్రజలు సెల్‌ఫోన్‌ను ఊహించలేదు. 1990ల్లో ఉన్న వాళ్లు ఇంటింటికీ ఫుడ్‌ డెలివెరీ సర్వీసును ఊహించలేదు. 2000 ప్రారంభంలో ఉన్నప్పుడు వర్చువల్‌ రియాలిటీ/ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి టెక్నాలజీలను ఊహించలేదు. కానీ ఇప్పుడవన్నీ మన ముందున్నాయి. ఎవరైతే భవిష్యత్‌ను సరిగ్గా అంచనా వేసి బిజినెస్‌ చేస్తారో, వాళ్లు సక్సెస్‌ అవుతున్నారు. 


మార్కెట్‌లో మంచి ఆదరణ ఉన్న కొత్త బిజినెస్‌ అవకాశాలు: 


1. గ్రీన్ అండ్ సస్టైనబుల్ బిజినెస్‌: ప్రస్తుతం, వాతావరణ మార్పుల మీద అన్ని దేశాలు సీరియస్‌గా ఉన్నాయి, ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. పునరుత్పాదక & పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, వ్యర్థాల తగ్గింపుపై ఫోకస్‌ పెట్టే వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. వీటిలో... క్లీన్ ఎనర్జీ, సస్టైనబుల్ ఫ్యాషన్, జీరో-వేస్ట్ ప్యాకేజింగ్, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాలు ఉన్నాయి.


2. ఆరోగ్య సంరక్షణ: టెలీ మెడిసిన్, పర్సనలైజ్డ్ మెడిసిన్, హెల్త్ మానిటరింగ్ పరికరాలు, AIతో పని చేసే డయాగ్నస్టిక్స్‌ వంటి ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలన్నింటినీ ప్రస్తుతం ఒకేతాటిపైకి తెస్తున్నారు. దీనివల్ల పేషెంట్ పట్ల తీసుకునే కేర్‌ మరింత మెరుగవుతుంది. ప్రస్తుతం ఈ వ్యాపారాలు చాలా కీలక అవకాశాలను అందిస్తున్నాయి. 


3. రిమోట్ వర్క్ సొల్యూషన్స్: కరోనా టైమ్‌ నుంచి రిమోట్ వర్క్‌ (వర్క్‌ ప్రమ్‌ హోమ్‌, వర్క్‌ ఫ్రమ్‌ ఫీల్డ్‌) మెయిన్‌ స్ట్రీమ్‌గా మారింది. వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లు, సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్లు, రిమోట్ టీమ్-బిల్డింగ్ యాక్టివిటీస్ వంటి సర్వీసులకు ఉపయోగించుకునే వ్యాపారాలకు ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి.


4. వృద్ధుల సంరక్షణ: ప్రపంచ జనాభా, ముఖ్యంగా చాలా దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతోంది. వృద్ధుల కోసం ఇంటి వద్దకే వెళ్లి ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడం, దీనికి సంబంధించిన టెక్నాలజీలు, వృద్ధుల అవసరాలు తీర్చే సరికొత్త ఆవిష్కరణలకు ఇప్పుడు డిమాండ్‌ నడుస్తోంది.


5. ఈ-కామర్స్ & లాస్ట్-మైల్ డెలివరీ: ఆన్‌లైన్ షాపింగ్‌ పరిధి అంతు లేకుండా విస్తరిస్తోంది. ఇది, సమర్థవంతమైన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ పేమెంట్‌ సొల్యూషన్లు, లాస్ట్‌-మైల్ డెలివరీ సర్వీసులకు డిమాండ్‌ను పెంచుతూనే ఉంది.


6. వ్యక్తిగత పోషకాహారం & ఆరోగ్యం: మహమ్మారి తర్వాత వ్యక్తిగత ఆరోగ్యం మీద ప్రజల్లో ఫోకస్‌ పెరిగింది. ఒక వ్యక్తి శరీర తత్వానికి, చేసే పనికి, శరీర అవసరాలకు తగ్గట్లుగా పర్సనలైజ్డ్‌ న్యూట్రిషన్‌ ప్లాన్స్‌, ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లు, వెల్‌నెస్ యాప్‌లు, వేరియబుల్‌ హెల్త్‌ ట్రాకర్‌లు అందించే వ్యాపారాలకు ఆదరణ పెరుగుతోంది.


7. వర్చువల్ రియాలిటీ (VR) & ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR): VR & AR టెక్నాలజీ అనగానే ఠక్కున గేమ్స్‌ గుర్తుకొస్తాయి. గేమింగ్‌కు మాత్రమే కాదు.. వర్చువల్ టూరిజం, రిమోట్ ట్రైనింగ్‌, వర్చువల్ కార్యక్రమాలు, ఇంటరాక్టివ్ మార్కెటింగ్ క్యాంపెయినింగ్‌కు కూడా VR & AR అప్లికేషన్‌లు ఉన్నాయి.


8. సైబర్ సెక్యూరిటీ: డిజిటల్ దోపిడీదార్లు, హ్యాకర్లు చాలా సోఫెస్టికేటెడ్‌గా మారడంతో... వాళ్ల బారి నుంచి రక్షించుకోవడానికి అడ్వాన్స్‌డ్‌ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్, డేటా ప్రొటెక్షన్ సర్వీస్‌లు, ప్రైవసీ టూల్స్‌ అందించే బిజినెస్‌లకు హై డిమాండ్‌ నడుస్తోంది.


9. ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్‌టెక్): ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకోవడం, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, నైపుణ్య శిక్షణ, అభ్యాస పరిష్కారాలు వంటివాటిని ఎప్పకప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఎడ్‌టెక్‌ రంగం అభివృద్ధి చెందుతోంది.


10. స్పేస్ & ఏరోస్పేస్ ఇండస్ట్రీ: వినువీధి ప్రయాణాలు, ఉపగ్రహాల సాంకేతికతను ప్రైవేటీకరించడంతో.. స్పేస్ టూరిజం, శాటిలైట్ కమ్యూనికేషన్, అంతరిక్ష పరిశోధనల వ్యాపారాలకు అవకాశాలు పెరుగుతున్నాయి.


11. పునరుత్పాదక ఇంధనం రంగంలో వసతులు: క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు... ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్ల వంటి పునరుత్పాదక ఇంధన మౌలిక సదుపాయాలను నిర్మించడం, నిర్వహించడంపై దృష్టి పెట్టే కంపెనీలు కీలక పాత్ర పోషిస్తాయి.


12. వ్యక్తిగత సమాచారం నిర్వహణ: టెక్నాలజీ పెరిగే కొద్దీ వ్యక్తిగత సమాచారానికి రక్షణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో.. డేటాను సురక్షితంగా నిల్వ చేయడం, ఎన్‌క్రిప్షన్, డేటా నిర్వహణ టూల్స్‌ను అందించే వ్యాపారాలు మార్కెట్లో మంచి పొజిషన్‌లోకి వస్తున్నాయి.


13. సర్క్యులర్ ఎకానమీ ఇనిషియేవ్స్‌: వ్యర్థాలను తగ్గించడం, మెటీరియల్‌లను తిరిగి ఉపయోగించడం మరియు ఉత్పత్తులను రీసైక్లింగ్ చేయడం ద్వారా వృత్తాకార ఆర్థిక సూత్రాలను ప్రోత్సహించే వ్యాపారాలు సంభావ్య లాభాలను ఆర్జించేటప్పుడు స్థిరత్వానికి దోహదం చేస్తాయి.


14. వెల్‌నెస్‌ & మానసిక ఆరోగ్యం: వెల్‌నెస్‌, మానసిక ఆరోగ్యం కోసం రకరకాల పనులు చేయడం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. వెల్‌నెస్‌ &మెంటల్‌ హెల్త్‌ గ్రాఫ్‌ పెంచే ఆరోగ్య సేవలు, ఒత్తిడి తగ్గించే సాధనాలు, ధ్యానం యాప్‌లు, ఎమోషనల్‌ సపోర్ట్‌ రిసోర్సెస్‌ అందించే వ్యాపారాలకు అవకాశాలు లభిస్తున్నాయి.


15. బయోటెక్నాలజీ & జీన్ ఎడిటింగ్: బయోటెక్నాలజీ, జీన్ ఎడిటింగ్, పర్సనలైజ్డ్‌ మెడిసిన్‌ వంటివి ఆరోగ్య సంరక్షణ రంగంలో గేమ్‌ ఛేంజర్స్‌గా నిలుస్తాయి.


ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్‌ చేయడానికి ముందు సమగ్ర పరిశోధన, ప్రణాళిక, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్స్‌లో మార్పులు చేయడం చాలా అవసరం. మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా... ఆ రంగంలో గ్యాప్స్‌ గుర్తించడం & వాటిని ఫిల్‌ చేసే ప్రొడక్ట్స్‌/సర్వీసులు అందించడం, ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడం, ఉత్పత్తి/సేవల ద్వారా కస్టమర్లకు ప్రత్యేక విలువను అందించడం వంటి అంశాలపై మీ విజయం ఆధారపడి ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: ఈ నెలలో నాలుగు పబ్లిక్‌ ఆఫర్స్‌ రె'ఢీ' - బరిలో దిగుతున్న టాటా, టీవీఎస్‌ గ్రూపులు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial