షెర్లిన్ చోప్రా ఎంత బోల్డ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆన్ స్క్రీన్‌పై ఆమె చేసే క్యారెక్టర్స్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా తాను చాలా బోల్డ్. తను కనిపించే విధానంలో, మాట్లాడే పద్ధతిలో.. ఇలా అన్నింటిలో షెర్లిన్ బోల్డ్‌గా ఉంటుంది. అందుకే ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంది షెర్లిన్. తాజాగా ఆమె కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటానని తెలిపింది. అంతేకాదు, ఆయన్ని తాను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండీషన్ ఉందని చెప్పింది.


సరదా ప్రశ్నకు సీరియస్ సమాధానం..
షెర్లిన్ చోప్రా ఇటీవల ముంబయిలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌ వద్ద ఫొటోగ్రాఫర్ల కంపడింది. ఈ సందర్భంగా ఓ ఫోటోగ్రాఫర్.. ‘‘మీకు రాహుల్ గాంధీని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే చేసుకుంటారా’’ అని అడిగాడు. ఇందుకు షెర్లీన్ తెలివిగా సమాధానం చెప్పింది. ‘‘హా ఎందుకు చేసుకోను. కానీ పెళ్లి తర్వాత నా ఇంటి పేరు మారకూడదు. అదే నా మెయిన్ కండీషన్’’ అని తెలిపింది. రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా అనడంకంటే దానికి తను పెట్టిన కండీషనే చాలామంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.


ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్..
ఇప్పటికే షెర్లిన్ చోప్రా ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. గూగుల్‌లో కూడా అప్పుడే షెర్లిన్‌కు, రాహుల్ గాంధీకి ఉన్న సంబంధం ఏంటని సెర్చ్‌లు మొదలయ్యాయి. మోదీ ఇంటిపేరుపై చేసిన రిమార్క్‌ విషయంలో రాహుల్ గాంధీ ఎదుర్కుంటున్న నేర ఆరోపణను సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. అది జరిగిన కొన్నాళ్లకే కేరళలోని వాయనాడ్ నియోజకవర్గానికి లోక్ సభ ఎంపీగా రాహుల్ గాంధీ ఎన్నుకోబడ్డారు. అయినా కూడా మోదీ ఇంటిపేరుపై చెలరేగిన కాంట్రవర్సీని చాలామంది ప్రజలు మర్చిపోలేదు. అది దృష్టిలో పెట్టుకునే షెర్లిన్ చోప్రా కూడా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చి ఉండవచ్చని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు.


Also Read: 'మీ బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోండి' అంటూ దీపికా సలహా - రణవీర్ సింగ్ స్పందన ఇదీ


ఎప్పుడూ బోల్డ్..
ఇక షెర్లిన్ చోప్రా.. నేను ఇలా చేస్తే ఎవరు ఏం అనుకుంటారో అని ఆలోచించే మహిళ కాదు.. మనసుకు ఏది అనిపిస్తే అది బోల్డ్‌గా మాట్లాడేస్తుంది. గత నెలలో తనను ఒక ఫైనాన్షియల్ వేధిస్తున్నాడు అంటూ జుహూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది షెర్లిన్. ఒక వీడియోను అడ్డం పెట్టుకొని ఆ ఫైనాన్షియర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనను బెదిరింపులకు గురిచేస్తున్నాడని, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని తెలిపింది. ఇక ‘బిగ్ బాస్ 13’లో పాల్గొన్నప్పుడు కూడా హౌజ్‌లో షెర్లిన్ బోల్డ్ బిహేవియర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలా కావాలని కాకపోయినా.. ఏదో ఒక చేస్తూ ఎప్పుడూ వార్తల్లోని ఉంటుంది హాట్ భామ షెర్లిన్ చోప్రా. మీ టూ లాంటి విషయాల్లో కూడా షెర్లిన్ తన అభిప్రాయాలను నిరభ్యంతరంగా బయటపెట్టేది. 


Also Read: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ రీ రిలీజ్‌కు రికార్డ్ కలెక్షన్స్ - 15 ఏళ్ళయినా అదే క్రేజ్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial