15 ఏళ్ల క్రితం విడుదలైన సినిమా రీ రిలీజ్ చేస్తే అసలు కలెక్షన్స్ వస్తాయా, అది కూడా డైరెక్ట్ తెలుగు మూవీ కాదు.. ఇలా పలు అనుమానాల మధ్య విడుదలయ్యింది ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’. కానీ సినిమాకు థియేటర్లలో వస్తున్న విశేష స్పందన చూసి హీరో సూర్య సైతం సంతోషంతో సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 15 ఏళ్లు అయినా కూడా ఈ సినిమాను, సినిమాలోని పాటలను ఎవరూ మర్చిపోలేదని థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అర్థమవుతోంది.


ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
శుక్రవారం.. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన మొదటిరోజు నుండే ప్రతీ థియేటర్‌లో హౌస్‌ఫుల్ షోలు నడుస్తున్నాయి. ఇప్పటికీ కొంతమందికి టికెట్లు దొరకడం లేదు. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ టికెట్ల కోసం థియేటర్ల దగ్గర ప్రేక్షకులు బారులు తీరడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేవలం మొదటి రోజు మాత్రమే కాదు వీకెండ్‌లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోయింది. ఇక ఈ రీ రిలీజ్ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లో రూ.2.5 గ్రాస్ కలెక్షన్స్ సాధించడం చూసి నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇది ఒక సెన్సేషన్ అని వారు అంటున్నారు. మొదటిసారి ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ విడుదలైనప్పుడు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఈ నెంబర్స్ అనేవి చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్తున్నారు.


‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ ఈ రేంజ్‌లో హిట్ అవ్వడానికి, 15 ఏళ్లయినా ఇంకా ప్రేక్షకులకు ఫ్రెష్‌గా గుర్తుండడానికి దీని ఆల్బమ్ కూడా ఒక కారణమే. హారిస్ జయరాజ్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లింది. థియేటర్లలో పాటలకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. తెరపై హీరోతో పాటు థియేటర్లలో ఆడియన్స్ కూడా స్టెప్పులేస్తున్నారు. ముఖ్యంగా ‘చంచలా’ పాట అనేది మరోసారి బ్రేకప్ పాటల్లో టాప్ స్థానానికి వెళ్లిపోయింది. థియేటర్లలో ఈ పాటకు యూత్ వేస్తున్న స్టెప్పులు, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


అన్నీ పర్ఫెక్ట్..
సూర్య, సమీరా రెడ్డి కెమిస్ట్రీ ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’కు మేజర్ హైలెట్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే పాటలు మ్యూజిక్ లవర్స్‌కు మరోసారి థియేటర్లలో ఫీస్ట్‌ను అందిస్తున్నాయి. ఇక సూర్య, దివ్య స్పందన కెమిస్ట్రీ.. వీరిద్దరు స్క్రీన్‌పై కనిపించేటప్పుడు వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. ఇలా ఎన్నో అంశాలు.. 15 ఏళ్ల తర్వాత కూడా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రాన్ని ఒక లెవెల్‌లో నిలబెట్టాయి. తమిళంలో ఎన్నో రొమాంటిక్ చిత్రాలు తెరకెక్కించిన గౌతమ్ వసుదేవ్ మీనన్ సైతం తాను తెరకెక్కించిన సినిమాల్లో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ తనకు పర్సనల్‌గా చాలా ఇష్టమని పలుమార్లు పబ్లిక్‌గా చెప్పారు. హారీస్ జయరాజ్ అందించిన ఎన్నో ఆల్బమ్స్‌లో కూడా ఇది నెంబర్ 1గా ఉంటుందని మూవీ ఫ్యాన్స్ అంటున్నారు. 


Also Read: టాలీవుడ్ సీనియర్ హీరో నాతో అలా ప్రవర్తించాడు, ఘోరమైన అనుభవాన్ని బయటపెట్టిన రాధిక ఆప్టే


Join Us on Telegram: https://t.me/abpdesamofficial