మలయాళ స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో 'వృషభ' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ ప్రాజెక్టు గ్రాండ్ గా లాంచ్ అవ్వగా.. ముహూర్తం సన్నివేశానికి శ్రీకాంత్ భార్య ఊహ క్లాప్ కొట్టారు. ఇక ఈ సినిమా లాంచ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ ని అందించారు. ఈ సినిమాలో ఏకంగా ఓ హాలీవుడ్ మేకర్ భాగం అవుతున్నట్లు తెలుస్తోంది.


హాలీవుడ్లో మూన్ లైట్(Moon Light), త్రీ బిల్ బోర్డ్స్(Three Billboards) అవుట్ సైడ్ ఎబింగ్(Out Side Ebbing) మిస్సోరి(Missouri) వంటి సినిమాలు నిర్మించిన ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ నిర్మాత నిక్ థర్ లో  'వృషభ' ప్రాజెక్టుకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నట్లు  మూవీ టీం పేర్కొంది.ఈ మేరకు వృషభ సినిమా హాలీవుడ్ టచ్ ఇచ్చేలా ఉండబోతున్నట్లు మోడల్ సెట్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే నిక్ థర్ లో వృషభ సెట్ గురించి చర్చిస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోతో సినిమా హైటెక్నికల్ వాల్యూస్ తో గ్రాండియర్ గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.






ఇక హాలీవుడ్ ప్రొడ్యూసర్ నిక్ తర లో తన సోషల్ మీడియాలో వృషభ ప్రాజెక్ట్ గురించి పలు పోస్టులు చేశారు.." వృషభ నా మొదటి భారతీయ చిత్రం. ఈ సినిమా కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నేను ఈ సినిమా కోసం సృజనాత్మకతతో సహా ఫిలిం మేకింగ్ లోని విభిన్న అంశాలను పరిశీలిస్తాను. ఇది నా మొదటి బహుభాషా చిత్రం. ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. ప్రతి సినిమా నాకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అలాగే వృషభతో ఆ అనుభవం అసాధారణంగా ఉంటుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను" అంటూ పేర్కొన్నారు.


మరోవైపు నిర్మాత విశాల్ గుర్నాని కూడా ఈ సందర్భంగా పోస్ట్ పెడుతూ.." నిక్ తర్లో మాతో జతకట్టడంతో మా సినిమా ఎంత భారీ స్థాయిలో మరియు గ్రాండియర్ గా రూపొందుతుందో ఎవరైనా ఊహించవచ్చు. హాలీవుడ్ సినిమాలతో సమానంగా రూపొందుతున్న మొదటి భారతీయ చిత్రాలలో వృషభ కూడా ఒకటి. మరియు నిక్ లాంటి విశ్వసనీయత కలిగిన ఓ ఫిలిం మేకర్ మా వృషభ టీంలో చేరడం మా అదృష్టం" అంటూ రాసుకొచ్చారు.


కాగా పాన్ ఇండియా లెవెల్ లో తండ్రి కొడుకుల మధ్య సాగే ఈ యాక్షన్ డ్రామాలో షానయా కపూర్, జహ్రా ఎస్ ఖాన్, శ్రీకాంత్, రాగిణి ద్వివేది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమోషన్స్ తో పాటు హై టెక్నికల్ వాల్యూస్ మరియు భారీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. 2024లో రాబోతున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో 'వృషభ' కూడా ఒకటి. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్, ఏవీఎస్  స్టూడియోస్ బ్యానర్ లపై ఏక్తా కపూర్, వరుణ్ మథుర్, అభిషేక్ వ్యాస్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : 'మీ బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోండి' అంటూ దీపికా సలహా - రణవీర్ సింగ్ స్పందన ఇదీ






Join Us on Telegram: https://t.me/abpdesamofficial