Upcoming IPOs: మన దేశంలో పండుగల సీజన్ ఇంకా స్టార్ట్ కాకపోయినా, స్టాక్ మార్కెట్‌లో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది జులై నెలలో, ఈక్విటీ మార్కెట్‌లో చాలా IPOలు అదరగొట్టాయి. పెద్ద కంపెనీలతో పాటు, SME సెగ్మెంట్‌లోనూ లిస్టింగ్స్ జరిగాయి. ఆ విన్నింగ్ రన్ ఇంకా కొనసాగుతోంది.
మార్కెట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, మరికొన్ని నాలుగు కొత్త IPOలు లాంచ్ కాబోతున్నాయి. ఆసక్తికరంగా, ఈ ఆఫర్స్ తెస్తున్న కంపెనీల్లో టాటా గ్రూప్, TVS గ్రూప్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా, మరికొన్ని రోజుల పాటు
లిస్టింగ్స్ పరంగానూ దలాల్ స్ట్రీట్ బిజీగా ఉంటుంది. ఇటీవలే ఇనీషియల్ ఆఫర్లు ముగించుకున్న 6 కంపెనీలు, వాటి షేర్ల లిస్టింగ్ కోసం క్యూలో ఉన్నాయి.
మరికొన్ని రోజుల్లో మార్కెట్‌లోకి రానున్న IPOలు:
టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఐపీవో (TVS Supply Chain Solutions IPO)
ఈ పబ్లిక్ ఆఫర్ ఈ నెల 10న ఓపెన్ అవుతుంది, 14న క్లోజ్ అవుతుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. IPOలో భాగంగా, 1.42 కోట్ల షేర్లను ప్రస్తుత షేర్‌హోల్డర్లు OFS రూట్‌లో అమ్ముతారు. ఆగస్టు 22న షేర్ల కేటాయింపు జరుగుతుంది. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి ఆగస్టు 23న షేర్లు జమ అవుతాయి. షేర్ల లిస్టింగ్ ఆగస్టు 24న ఉంటుంది.
బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్ ఐపీవో (Balaji Specialty Chemicals IPO)
ఈ IPO విలువ దాదాపు రూ. 425 కోట్లు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ & OFS రెండూ ఉన్నాయి. సబ్‌స్క్రిప్షన్ కోసం ఆగస్టు 18న ఇది ప్రారంభమవుతుంది, ఆగస్టు 22 వరకు అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 25న షేర్లు కేటాయిస్తారు. ఆగస్టు 29న విన్నింగ్ బిడ్డర్ల డీమ్యాట్ అకౌంట్లలోకి షేర్లు వచ్చి చేరాతాయి. BSE & NSE రెండింటిలో ఆగస్టు 30న షేర్ల లిస్టింగ్ జరుగుతుంది, ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.
టాటా టెక్నాలజీస్ ఐపీవో (Tata Technologies IPO)
టాటా గ్రూప్ కొత్త IPO కోసం ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. సుమారు 19 సంవత్సరాల విరామం తర్వాత, టాటా గ్రూప్ నుంచి ఒక IPO మార్కెట్లోకి రాబోతోంది. ఈ ఐపీవో ద్వారా దాదాపు 40 కోట్ల షేర్లను కంపెనీ లిస్ట్ చేయనుంది. IPO ప్రైస్ దాదాపు రూ.295 ఉండవచ్చని అంచనా. ప్రైస్ బ్యాండ్ లేదా లిస్టింగ్ వివరాల గురించి ఈ కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు.
శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ ఐపీవో (Srivari Spices and Foods IPO)
ఇది SME సగ్మెంట్ IPO, ఆగస్టు 7న ఓపెన్ అయింది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.40-42గా నిర్ణయించారు. ఐపీఓ నుంచి రూ. 9 కోట్లు సమీకరించాలని కంపెనీ చూస్తోంది. IPO తర్వాత, NSE ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఐపీవో లిస్ట్ అవుతుంది. ఈ షేర్ల ట్రేడింగ్ ఆగస్టు 18 నుంచి ప్రారంభమవుతుంది.
SBFC ఫైనాన్స్ IPO ఆగస్టు 16న, కాంకర్డ్ బయోటెక్ IPO ఆగస్టు 17న లిస్ట్ అవుతాయి.
SME IPO ఒరియానా పవర్ లిస్టింగ్ ఆగస్టు 11న ఉంటుంది. ఐటీ రంగంలోని ఎస్‌ఎంఈ కంపెనీ విన్సిస్ ఐటీ షేర్లు ఆగస్టు 14న లిస్ట్ కానున్నాయి. సంగని హాస్పిటల్స్ షేర్ల ట్రేడింగ్ ఆగస్ట్ 17 నుంచి ప్రారంభం అవుతుంది. యుడిజ్ సొల్యూషన్స్ షేర్లు కూడా SME విభాగంలోనే ఆగస్టు 17 నుంచి స్టార్ట్ అవుతాయి.
మరో ఆసక్తికర కథనం: పెన్నీ స్టాక్స్ అంటే ఫన్నీ అనుకుంటివా? పవర్‌ఫుల్ స్టాక్స్ - డబ్బుల వర్షం కురిపించాయి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial