YSR Kalyanamasthu: నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల - వారి ఖాతాల్లో 141కోట్లు చేయనున్న సీఎం జగన్

YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధుల్ని విడుదల చేయనున్నారు.

Continues below advertisement

YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa: ఏపీ ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల పెళ్లికి అందించనున్న ఆర్థిక సాయం నిధులను బుధవారం విడుదల చేయనుంది.  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా నిధుల్ని విడుదల చేయనున్నారు. నేడు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు. ఏప్రిల్- జూన్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని వధువు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అందుకు అధికారులు అన్ని  ఏర్పాట్లు చేశారు.

Continues below advertisement

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు ఏపీ ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు" ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ పథకాలకు అర్హత సాధించాలంటే వధూవరులిద్దరికీ 10th క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు. దీనివల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి కారణం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు పెళ్లి నాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు. అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన వల్ల బాల్య వివాహాల నివారణతో పాటు వారు ఇంటర్ వరకు చదివేందుకు అమ్మ ఒడి సాయం, ఆ పై చదువులకు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, భోజన, వసతి ఖర్చులకు సైతం జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి ఉండడంతో వారు ఉన్నత విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు అవుతారన్న తపన, తాపత్రయంతో పని చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

ఎంత మంది లబ్ధిదారులంటే...
ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గడిచిన 9 నెలల్లోనే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద 35,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 267.20 కోట్ల రూపాయలు ను జగనన్న ప్రభుత్వం జమ చేసింది. దూదేకుల, నూర్ బాషాల విజ్ఞప్తిని మన్నించి వారికి కూడా వైఎస్సార్ షాదీ తోఫా తో సమానంగా లబ్ధి రూ. 1,00,000 కు పెంచి అందిస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఈ వర్గాలకు చెందిన అర్హులైన గత లబ్ధిదారులకు కూడా పెరిగిన ఈ పెంపు పథకం ప్రారంభం నుంచి బ్యాక్ డేట్ తో వర్తింపు ను అమలులో తెచ్చారు.

ఎవరికి ఎంతమేర సాయం అందుతుందంటే..
ఎస్సీలకు వైఎస్సార్ కళ్యాణ మస్తు వైఎస్సార్ షాదీ తోఫా కింద జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం (రూ.లలో) 1,00,000. ఎస్సీ (కులాంతర వివాహం) లకు వైసీపీ ప్రభుత్వం అందించే సాయాన్ని  1,20,000కి పెంచింది. ఎస్ టీ లకు జగన్ ప్రభుత్వం రూ. 1,00,000 అందిస్తోంది. గత ప్రభుత్వం ఎస్ టీ (కులాంతర వివాహం) లకు రూ. 75,000 ఇవ్వగా.. నేడు వైసీపీ ప్రభుత్వం రూ.1,200,000కి పెంచింది. 

వైసీపీ ప్రభుత్వం బీసీలకు రూ.50 వేలు, బీసీ (కులాంతర వివాహం)లకు రూ.75,000 అందిస్తోంది. ఏపీ ప్రభుత్వం మైనార్టీలకు లక్ష రూపాయలు ఇచ్చి చేయూతనిస్తోంది. విభిన్న ప్రతిభావంతులకు అందిస్తున్న సాయాన్ని రూ.1,50,000 చేసింది. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.40 వేలు చేసింది. 

వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా" లకు సంబంధించి ఏమైనా సలహాలు, సూచనలు చేయాలన్నా, సమస్యలు ఉన్నవారు  ఫిర్యాదుకు చేసేందుకు జగనన్నకు చెబుదాంలో భాగంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు https//gsws-nbm.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందవచ్చని ప్రభుత్వం చెపుతోంది.

Continues below advertisement
Sponsored Links by Taboola