AP Minister Botsa About Chiranjeevi: వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో చిరంజీవి వైసీపీ మంత్రి అంబటి రాంబాబు మీద సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి వ్యాఖ్యల పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయం గురించి స్పందించారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ ఓ పిచ్చుక అని చిరంజీవి ఒప్పుకున్నారా? అని బొత్స ప్రశ్నించారు.
ఏపీలో ఉన్న ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వాటిని అన్నింటిని కూడా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి మరీ అందజేస్తున్నారు. అయినప్పటికీ కూడా చిరంజీవి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి సమస్య పై ప్రభుత్వం స్పందిస్తోందని, చిరంజీవి వ్యాఖ్యలను చూసిన తరువాత పూర్తి స్థాయిలో స్పందిస్తామని మంత్రి అన్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు పై కూడా మంత్రి బొత్స కామెంట్స్ చేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే ఎంతో నవ్వు తెప్పిస్తుందన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం పనులు వేగంగా జరిగాయి...ఆయన కుమారుడు వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారని ఆయన నొక్కి చెప్పారు. వైఎస్ తవ్వించిన పోలవరం కాలువల్ని చంద్రబాబు పట్టిసీమగా మార్చారని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు రావలసిన ఆర్ అండ్ ఆర్ కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇంకొక ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రజలు విశ్రాంతి ఇస్తారని అన్నారు.
పుంగనూరులో ముందుగా అనుకోకపోతే ఆ తుపాకులు, కత్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. లోకేష్ తన పాదయాత్రలో ఏ అధికారి గురించీ సరిగా మాట్లాడలేదని మంత్రి బొత్స అన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు
ప్రజాస్వామ్యంలో యాత్రలు ఎవరైనా చేయొచ్చునని అన్నారు. విశాఖలో పవన్ చేపడుతున్న వారాహి యాత్ర గురించి దేశంలో చర్చ జరుగుతుందని అంటున్నారు.. చంద్రబాబు పుంగనూరు యాత్రలా విధ్వంసం చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. వారాహి యాత్రను తాము పట్టించుకొవడం లేదని మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు.