సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన 'జైలర్' మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మరికొన్ని గంటల్లో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్ళు చెదిరే స్థాయిలో జరిగింది. మరీ ముఖ్యంగా తమిళనాడు, ఓవర్సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. దాంతో ఓపెనింగ్స్ ఎంత ఉండొచ్చు? ఫస్ట్ డే సినిమా కలెక్ట్ చేయవచ్చు? అని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు మొదలు అయ్యాయి. 


మొదటి రోజు 50 కోట్లు గ్యారెంటీ!?
ఆగస్టు 7వ తేదీ వరకు ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో ఆరు లక్షలకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. ఈ రోజు కూడా అడ్వాన్స్ సేల్స్ బావున్నాయని టాక్. ఇక, తమిళనాడులో సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల దగ్గర బుకింగ్స్ ఉండనే ఉన్నాయి. అందువల్ల, ఫస్ట్ డే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


ఒక్క తమిళనాడులో 'జైలర్' సినిమా మొదటి రోజు సుమారు 25 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేస్తుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే... రూ. 50 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత 'జైలర్' మీద అంచనాలు పెరిగాయి. రజనీకాంత్ తన వయసుకు తగ్గ పాత్ర చేయడమే కాదు... ఆయన నుంచి అభిమానులు కోరుకునే అంశాలు కూడా సినిమాలో ఉన్నట్లు అర్థం అవుతోంది. 


Also Read : 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?



'జైలర్' ట్రైలర్ చూస్తే... డైనింగ్ టేబుల్ ఫైట్ దగ్గర రజనీ ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్. అలాగే... తమన్నాతో చేసిన 'నువ్ కావాలయ్యా' సాంగ్ వైరల్ అయ్యింది. బజ్ తీసుకు వచ్చింది. ''ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు. కోతలే'' అని చిరునవ్వుతో పాటు కోపాన్ని ప్రదర్శిస్తూ రజనీకాంత్ చెప్పే డైలాగ్ ట్రైలర్ మొత్తం మీద హైలైట్ అని చెప్పాలి. యాక్షన్ సన్నివేశాలు అన్నీ సరిగ్గా కుదిరాయి. హిట్టు కళ కనబడుతోంది.
 
కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. నయనతార 'కో కో కోకిల', శివ కార్తికేయన్ 'వరుణ్ డాక్టర్', తమిళ స్టార్ హీరో విజయ్‌ 'బీస్ట్' సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. రజనీకి 169వ చిత్రమిది.


Also Read : 'సలార్' నటీనటులకు హోంబలే ఆ కండిషన్ పెట్టిందా? - ఆ ఒక్కటీ లీక్ కాకూడదని!


'జైలర్' సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, హిందీ నటుడు జాకీ ష్రాఫ్,  కన్నడ అగ్ర కథానాయకుడు శివ రాజ్‌ కుమార్, తెలుగు నటుడు సునీల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకా రమ్య కృష్ణ, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మారిముత్తు, రిత్విక్, శరవణన్, అరంతంగి నిషా, మహానంది శంకర్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్, కూర్పు : ఆర్. నిర్మల్, కళ : డాక్టర్ కిరణ్, యాక్షన్: స్టన్ శివ.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial