రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా 'సలార్' (Salaar Movie). 'కెజియఫ్' వంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ నీల్ ఈసారి ఏం తీసి ఉంటారు? కథ ఎలా ఉంటుంది? అనేది తెలుసుకోవాలని అభిమానులే కాదు... సగటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే... కథతో పాటు సినిమాలో ట్విస్టులు లీక్ కాకుండా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. 


'సలార్' నటీనటులకు ఓ కండిషన్...
ఆ ఒక్కటీ లీక్ కాకూడదని అలా అలా!
'ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు! టీవీ ఛానల్స్ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ లేదా సోషల్ మీడియా అకౌంట్స్... ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వకండి' అని నటీనటులకు చాలా ఖరాకండీగా హోంబలే ఫిలింస్ చెప్పిందని సమాచారం. ఆఖరికి పేపర్లకు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని చెప్పారట. అందుకు ముఖ్య కారణం స్టోరీ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే! 


ఇంటర్వ్యూలు ఇస్తే... మాటల మధ్యలో పొరపాటున కథ గురించి చెబుతారేమో? ఒకసారి కథ గురించి ఏదైనా విషయం చెప్పిన తర్వాత అది డిలీట్ చేయించడం కష్టం కనుక అసలు ఇంటర్వ్యూలు ఇవ్వవద్దని చెప్పేశారట. అదీ సంగతి!


ప్రభాస్ ముఖం సరిగా కనిపించకున్నా...
ఆల్రెడీ 'సలార్' టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ ముఖం అసలు కనిపించలేదు. కానీ, రెస్పాన్స్ మాత్రం అదిరింది. ఒక్క విషయంలో క్లారిటీ కూడా వచ్చింది.  'సలార్' రెండు భాగాలుగా థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్ చివరిలో 'పార్ట్ 1 : సీస్ ఫైర్' (Salaar Ceasefire) అని పేర్కొన్నారు. దాని అర్థం ఏమిటి? ఇంకో పార్ట్ ఉందని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ చేయాలని అనుకుంటే మూడో పార్ట్ కూడా చేయవచ్చు. 'కె.జి.యఫ్ 3' ఉందని చెప్పారుగా! ప్రస్తుతానికి అయితే రెండు పార్టులు ఉన్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు.


Also Read : 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?



  
'సలార్'కు 2000 కోట్లు గ్యారెంటీ - సప్తగిరి
'సలార్'లో తాను నటించినట్లు టాలీవుడ్ హీరో కమ్ కమెడియన్ సప్తగిరి ట్వీట్ చేశారు. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశానని తెలిపారు. ఆ తర్వాత ''సలార్ డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా రూ. 2000 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందని నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను'' అని సప్తగిరి పేర్కొన్నారు. ఆ మాటలు ప్రభాస్ అభిమానులకు సూపర్ డూపర్ కిక్ ఇస్తున్నాయి. సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన పాన్ వరల్డ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థకు ఆయన థాంక్స్ చెప్పారు. 


ఈ నెలలోనే 'సలార్' ట్రైలర్ విడుదల!
ఆగస్టులో.. అంటే ఈ నెలలో 'సలార్' ట్రైలర్ విడుదల చేస్తామని గతంలో ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. సినిమాను తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం... మొత్తం ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత చెప్పారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


Also Read : 'సలార్' టీజర్‌లో 'కెజియఫ్ 2' హింట్స్ - ఆ అంశాలు గమనించారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial