పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులను ఈ రోజు విడుదలైన 'సలార్' టీజర్ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. అందులో మరో సందేహం లేదు. అందుకు మెయిన్ రీజన్... ఒక్కటంటే ఒక్క షాట్‌లో కూడా ప్రభాస్ ముఖం కనిపించలేదు. ఆయన కటౌట్ చూపించి ఊరుకున్నారు. 


'కె.జి.యఫ్ 2' చూసిన ప్రేక్షకులు 'సలార్' మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇంకా ఎక్కువ ఆశించారు. అందువల్ల, అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. అయితే... ఒక్క విషయంలో 'సలార్' టీజర్ బాగా సక్సెస్ అయ్యింది. ఫుల్ మార్క్స్ కొట్టేసింది. థియేటర్లలో విలన్లను ప్రభాస్ ఊచకోత కోయడం గ్యారెంటీ అని బలంగా చెప్పింది. యాక్షన్ ట్రీట్ పక్కా అన్నమాట! ఆ సంగతి పక్కన పెడితే... దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' టీజర్ (Salaar Teaser)లో 'కె.జి.యఫ్ 2'తో లింక్ ఉందని హింట్స్ ఇచ్చారు. అవి ఏమిటో మీరు గమనించారా?


'కె.జి.యఫ్ 2' ఎండింగ్ టు 'సలార్'!
'కె.జి.యఫ్ 2' ఎండింగ్ గుర్తు ఉందా? పతాక సన్నివేశాలు పూర్తి అయ్యాక పార్ట్ 3 ఉందని హింట్ ఇచ్చారు. ఆ సన్నివేశంలో ప్రధానితో సైనికాధికారి మాట్లాడతారు. దానికి ముందు ఓ టాప్ యాంగిల్ షాట్ ఉంటుంది. ఇప్పుడు 'సలార్' టీజర్ చూస్తే... సేమ్ లొకేషన్ కనపడుతోంది. 


'కె.జి.యఫ్ 2'లో ఏకంగా పార్లమెంట్ భవనంలోకి వెళ్లి మరీ తనకు వ్యతిరేకంగా పావులు కదిపిన రాజకీయ నాయకుడిని రాకీ భాయ్ కాల్చి పారేస్తాడు. అంత స్వేచ్ఛగా పార్లమెంటులోకి రాకీ భాయ్ వెళ్ళడానికి సలారే కారణమని ఓ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు 'సలార్' టీజర్ చూస్తుంటే... స్నేహితుడి మీద సైనిక చర్య తీసుకోవడానికి కారణమైన ప్రధాని మీద సలార్ ఎటాక్ చేస్తాడా? అనే రీతిలో ఉంది. రాకీ భాయ్ నిర్మించిన రాజ్యాన్ని సలార్ కాపాడటమే సినిమా అని అభిమానులు ఊహిస్తున్నారు. లొకేషన్ ఒక్కటే కాదు... ఇంకా చాలా హిడెన్ హింట్స్ ప్రశాంత్ నీల్ దాచి పెట్టారు. ట్రైలర్ విడుదలైన తర్వాత వాటి గురించి ఇంకా వివరంగా చెప్పే వీలు ఉంటుంది. 


Also Read గుడిలో విజయ్ దేవరకొండ, సమంత - 'ఖుషి' కోసం యాగం, వైరల్ వీడియో



రెండు భాగాలుగా 'సలార్'  
Salaar Movie Two Parts : 'సలార్' రెండు భాగాలుగా థియేటర్లలోకి రానుంది. ఈ రోజు విడుదల చేసిన టీజర్ చివరిలో 'పార్ట్ 1 : సీస్ ఫైర్' అని పేర్కొన్నారు. దాని అర్థం ఏమిటి? ఇంకో పార్ట్ ఉందని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ చేయాలని అనుకుంటే మూడో పార్ట్ కూడా చేయవచ్చు. 'కె.జి.యఫ్ 3' ఉందని చెప్పారుగా! ప్రస్తుతానికి అయితే రెండు పార్టులు ఉన్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. 


ఇంకో విషయంలో కూడా 'సలార్' టీజర్ ఓ క్లారిటీ ఇచ్చింది. సుమారు 400 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోందని చిత్ర బృందం పేర్కొంది. అదీ సంగతి!   


Also Read మహేష్ బాబు మీద భారీ యాక్షన్ సీన్ - బీహెచ్ఈఎల్‌లో...


కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్... 'మిర్చి'లో ప్రభాస్ చెప్పిన డైలాగ్. 'సలార్' టీజర్ చూసిన తర్వాత ఆ మాట మరోసారి గుర్తుకు వస్తుంది. మాఫియాకు బాస్, బడా గ్యాంగ్‌స్టర్ పాత్రకు ప్రభాస్ కంటే పర్ఫెక్ట్ ఎవరు ఉంటారు? కనీసం ఆయన ముఖం చూపించకపోయినా ఆ ఫైట్స్ ఎలా ఉంటాయో ఫ్యాన్స్, ఆడియన్స్ ఫీల్ అవుతున్నారంటే కారణం ఆయన కటౌట్. 'సలార్' టీజర్ స్టార్టింగులో... హీరోకి ఒక రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. లయన్, చీతా, టైగర్, ఎలిఫాంట్ వెరీ డేంజరస్. అయితే... జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే... ఆ పార్క్ లో సలార్ ఉన్నాడని అర్థం వచ్చేలా రెబల్ స్టార్ ప్రభాస్ ను చూపించారు. ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ యాక్షన్ టీజర్ అంతటా కనిపించింది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial