Guntur Kaaram Action Scenes : మహేష్ బాబు మీద భారీ యాక్షన్ సీన్ - బీహెచ్ఈఎల్‌లో...

Mahesh Babu's Guntur Kaaram Update : సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా 'గుంటూరు కారం'. దీనికి త్రివిక్రమ్ దర్శకుడు. ఇప్పుడు షూటింగ్ స్టేటస్ ఏమిటంటే?

Continues below advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు ఘట్టమనేని (Mahesh Babu) కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). ప్రస్తుతం సినిమా షూటింగ్ స్టేటస్ ఏమిటి? ఏం జరుగుతోంది? ఏమిటి? అంటే... 

Continues below advertisement

మహేష్ మీద భారీ యాక్షన్ సీన్!
'గుంటూరు కారం' కోసం ఈ వారం నుంచి మహేష్ బాబు మీద భారీ యాక్షన్ సీన్ తీయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేశారు. జూలై 7న హైదరాబాద్, బీహెచ్ఈఎల్‌ ఏరియాలో షూటింగ్ చేయనున్నారు. 'సర్కారు వారి పాట' కోసం విశాఖలో మహేష్ అవుట్ డోర్ షూటింగ్ చేశారు. బహుశా... చాలా రోజుల తర్వాత హైదరాబాద్ అవుట్ డోర్ షూటింగ్ చేయడం ఇదేనేమో!? సాధారణంగా హైదరాబాద్ సిటీలోని ఫిల్మ్ స్టూడియోల్లో మహేష్ షూటింగ్స్ జరుగుతుంటాయి. అయితే... బయటకు రావడం తక్కువ. 

కల్ట్ క్లాసిక్ హిట్స్ 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. సుమారు 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. అందుకని, అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, అదే సమయంలో పలు పుకార్లు కూడా వినిపించాయి. ఈ సినిమా షూటింగ్ ఓ అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అంటూ సాగుతోంది. హీరోయిన్ పూజా హెగ్డే స్థానంలో మీనాక్షీ చౌదరిని ఎంపిక చేశారని సమాచారం. 

శంకరపల్లిలో జరిగిన 'గుంటూరు కారం'
Guntur Kaaram Shooting Update : దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'గుంటూరు కారం' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారులోని శంకరపల్లి ఏరియాలో చిత్రీకరణ జరిగింది. అక్కడ ఈ సినిమా కోసమే భారీ సెట్ వేశారు. చిన్న షెడ్యూల్ అయినప్పటికీ... ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగింది. 

Also Read : నెల క్రితమే నిహారిక, చైతన్యకు విడాకులు - ఆలస్యంగా వెలుగులోకి!

శంకరపల్లిలో జరిగిన చిత్రీకరణలో మహేష్ బాబుతో పాటు నటుడు రఘుబాబు, నటి ఈశ్వరీ రావు తదితరులు 'గుంటూరు కారం' చిత్రీకరణలో పాల్గొన్నారు. హీరో ఇంటి సెట్ లో షూట్ చేశారు. ఆగస్టు 9న హీరో పుట్టినరోజు. అప్పుడు మేజర్ బ్రేక్ ఉంటుందని తెలిసింది. అది మినహా అక్టోబర్ నెలాఖరు వరకు షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారట.  

Also Read సమంత మెడలో నల్లపూసలు - పెళ్లి గురించి హింట్?

పూజా హెగ్డే లేదని క్లారిటీ వచ్చిన తర్వాత
'గుంటూరు కారం'లో పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీ లీల... ఇద్దరినీ హీరోయిన్లుగా తీసుకున్నారు. అయితే... సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకొన్నారు. చిత్రీకరణ అనుకున్న విధంగా సాగకపోవడం, షెడ్యూల్స్ ఆలస్యం అవుతూ ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం ఆమెకు కష్టమైంది. దాంతో 'గుంటూరు కారం' నుంచి బయటకు వచ్చారు. ఆమె లేదని క్లారిటీ వచ్చిన తర్వాత 'గుంటూరు కారం' చిత్రీకరణ చేయడం ఇదే. త్రివిక్రమ్ లాస్ట్ రెండు సినిమాలు 'అల వైకుంఠపురములో', 'అరవింద సమేత వీర రాఘవ'లో పూజా హెగ్డే నటించారు. 'గుంటూరు కారం' వీళ్ళ కలయికలో హ్యాట్రిక్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే... అనివార్య కారణాల వల్ల బ్రేక్ పడింది.

Continues below advertisement