మెగా కుటుంబంలో మరో విడాకులు చోటు చేసుకున్నాయి. నాగబాబు కుమార్తె, నటి & నిర్మాత నిహారిక కొణిదెల (Niharika Konidela) వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఆమె ఎందుకు విడాకులు తీసుకున్నారు? సంసార జీవితంలో చిక్కులు ఎందుకు వచ్చాయి? కారణాలు ఏమిటి? అనేది బయటకు రాలేదు. కానీ, నిహారిక విడాకులపై  ఇప్పుడు జోరుగా కథనాలు వస్తున్నాయి.

పరస్పర అంగీకారంతో విడాకులునిహారిక పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda)తో ఆగస్టు 13, 2020లో ఆమె నిశ్చితార్థం జరిగింది. అదే ఏడాది డిసెంబర్ 9న ఏడు అడుగులు వేశారు. రాజస్థాన్, ఉదయ్‌పూర్ కోటలో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు, అతి కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో వివాహం జరిగింది. 

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి జె. ప్రభాకర్ రావు సన్నిహితులు. చాలా ఏళ్లుగా ఇరువురి కుటుంబాల మధ్య పరిచయం ఉంది. పిల్లలకు పెళ్లి చేస్తే స్నేహబంధం బంధుత్వంగా మారుతుందని ఆశించారు. పెళ్లి చేశారు. అయితే... పిల్లల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అవి విడాకులకు దారి తీశాయి. పరస్పర అంగీకారంతో నిహారిక, చైతన్య వేరు పడ్డారు. 

నెల క్రితమే విడాకులు... ఆలస్యంగా వెలుగులోకి!కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం నిహారిక, చైతన్య చేసిన దరఖాస్తు బయటకు రావడంతో మంగళవారం (జూలై 4) సాయంత్రం హడావిడి జరిగింది. అసలు విషయం ఏమిటంటే... నెల క్రితమే ఇద్దరికీ కోర్టు విడాకులు మంజూరు చేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే... ఆలస్యంగా డివోర్స్ పిటిషన్ వెలుగులోకి రావడంతో ఇప్పుడు చర్చ జరుగుతోంది. 

విడాకుల దరఖాస్తు బయటకు ఎలా వచ్చింది?ఉన్నట్టుండి ఇప్పుడు విడాకుల దరఖాస్తు బయటకు ఎలా వచ్చింది? అని ఫిల్మ్ నగర్, మెగా ఫ్యామిలీ వర్గాల్లో డిస్కషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు చలామణీలో ఉన్న దరఖాస్తులో ఎక్కడా తేదీలు లేవు. దాంతో చాలా మంది తాజా పిటీషన్ అని భావిస్తున్నారు. జూలై 5కు విడాకులు వచ్చి నెల అవుతుంది.

Also Read సమంత మెడలో నల్లపూసలు - పెళ్లి గురించి హింట్?

నిహారిక, చైతన్య దారులు నెల క్రితం వేర్వేరు అయ్యాయి. అయితే... చాలా రోజుల క్రితమే ఇన్‌స్టాలో చైతన్య ఫోటోలను నిహారిక డిలీట్ చేయడంతో జనాలకు డౌట్ వచ్చింది. మరోవైపు చైతన్య కూడా నిహారిక ఫోటోలు డిలీట్ చేశారు. అయితే... మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్ట్ మాత్రం అలాగే ఉంచారు. హాలోవీన్ పార్టీ ఫోటోలు కూడా ఉన్నాయి. అందులోని ఓ ఫొటోలో చాలా జాగ్రత్తగా చూస్తే వెనుక నిహారిక ఉంటారు. 

నటన, నిర్మాణం మీద దృష్టి పెట్టిన నిహారికపెళ్లికి ముందు నిహారిక వెబ్ సిరీస్, సినిమాలు చేశారు. చేసినవి తక్కువే అయినా గానీ నటిగా కెరీర్ కంటిన్యూ అవుతూ ఉండేది. అయితే... పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చారు. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'ని ప్రొడ్యూస్ చేశారంతే! చైతన్య నుంచి వేరు పడటంతో ఇప్పుడు ఆమె మళ్ళీ నటన, నిర్మాణం మీద దృష్టి పెట్టారు. మే 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ 'డెడ్ పిక్సెల్స్'లో ప్రధాన పాత్ర పోషించారు. నిర్మాతగా రెండు మూడు ప్రాజెక్టులు చేస్తున్నారని తెలిసింది.   

Also Read 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో వైఎస్ జగన్ సర్కార్ పెన్షన్ స్కీమ్ మీద పంచ్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.Join Us on Telegram: https://t.me/abpdesamofficial